ఈ-స్కూటర్, సైక్లింగ్ ఉల్లంఘనల పర్యవేక్షణకు కొత్త ట్రాఫిక్ యూనిట్‌..!!

- April 13, 2025 , by Maagulf
ఈ-స్కూటర్, సైక్లింగ్ ఉల్లంఘనల పర్యవేక్షణకు కొత్త ట్రాఫిక్ యూనిట్‌..!!

యూఏఈ: దుబాయ్‌లోని అధికారులు త్వరలో సైక్లిస్టులు, ఈ-స్కూటర్ రైడర్ల ఉల్లంఘనలను పర్యవేక్షించడంపై దృష్టి సారించేందుకు ప్రత్యేక యూనిట్‌ను ప్రారంభించనున్నారు. కొత్త పర్సనల్ మొబిలిటీ మానిటరింగ్ యూనిట్ సైక్లింగ్, ఈ-స్కూటర్ ట్రాక్‌లపై ట్రాఫిక్ భద్రతను మెరుగుపరచడం లక్ష్యంగా పెట్టుకుందని,  అదే సమయంలో అన్ని సంబంధిత భద్రతా ప్రమాణాలకు అనుగుణంగా ఉండేలా చూసుకుంటుందని రోడ్లు, రవాణా అథారిటీ (RTA)  తెలిపింది. దుబాయ్ పోలీసుల సహకారంతో ప్రారంభించబడిన ఈ యూనిట్.. ట్రాఫిక్ నియమాలను పాటించడాన్ని పర్యవేక్షిస్తుంది. సైక్లింగ్ లేన్‌లపై ట్రాఫిక్ వేగాన్ని పర్యవేక్షిస్తుంది. సురక్షిత రైడింగ్ పద్ధతులపై ప్రజలకు అవగాహన కల్పించనున్నారు. నిబంధనలు ఉల్లంఘించినవారు ప్రస్తుత నిబంధనలకు అనుగుణంగా జరిమానాలను విధించనున్నారు.   

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com