మిత్ర హాస్పిటల్లో అందుబాటులోకి థులియం ఫైబర్ లేజర్ చికిత్సలు
- April 15, 2025
విజయవాడ: ప్రజలకు మెరుగైన వైద్య సేవలను అందించేందుకు నిరంతరం కృషి చేస్తున్న మిత్ర హాస్పిటల్ వైద్య బృందం..తమ హాస్పిటల్లో మరో అత్యాధునిక సాంకేతిక సంపత్తిని అందుబాటులోకి తీసుకొచ్చింది.కిడ్నీల్లో రాళ్లను తొలగించేందుకు అత్యాధునిక థులియం ఫైబర్ లేజర్ చికిత్సలను ప్రారంభించారు.ఈ సందర్భంగా సూర్యారావుపేటలో మిత్ర హాస్పిటల్లో మంగళవారం మీడియా సమావేశం ఏర్పాటు చేశారు.ఈ సమావేశంలో హాస్పిటల్ కన్సల్టెంట్ యూరాలజిస్ట్,ఆండ్రాలజిస్ట్ డాక్టర్ సతీష్ మర్రివాడ మాట్లాడుతూ.. ప్రజలకు ప్రపంచ స్థాయి వైద్య సేవలందించడమే లక్ష్యంగా కృషి చేస్తున్నామని, ఆ క్రమంలోనే థులియం ఫైబర్ లేజర్ చికిత్సలను అందుబాటులోకి తీసుకొచ్చామని తెలిపారు. ఈ అత్యాధునిక సాంకేతికత విభాగం ద్వారా మూత్రపిండాల్లోని రాళ్లను అత్యంత కచ్చితత్వంతో తొలగించవచ్చని అన్నారు. ఎటువంటి కోతలు, కుట్లు లేకుండా సూక్ష్మ పద్ధతి ద్వారా అత్యంత ప్రభావవంతంగా చికిత్స పూర్తవుతుందని, సంక్లిష్టమైన చికిత్సలను సైతం ఈ టెక్నాలజీ సరళతరం చేస్తుందని వివరించారు.చికిత్సాంతరం పేషెంట్ త్వరితగతిన కోలుకునే అవకాశం ఉంటుందని, చికిత్స చేసిన రోజు లేదా ఆ మరుసటి రోజునే పేషెంటును హాస్పిటల్ నుంచి డిశ్చార్జి చేయవచ్చని తెలిపారు.కిడ్నీ స్టోన్స్, ప్రోస్టేట్ చికిత్సల్లో గేమ్ చేంజర్ అని చెప్పదగిన టీఎఫ్ఎల్ చికిత్స ద్వారా సమీప కణజాలానికి ఎటువంటి నష్టం కలుగకుండా చికిత్సనందించవచ్చని, గట్టిగా ఉన్న పెద్దరాళ్లను సైతం ఈ చికిత్స ద్వారా సులభంగా తొలగించడం సాధ్యమవుతుందని వెల్లడించారు.మూత్ర ద్వారం సరిగా లేకపోవడం, మూత్రంలో మంట, అధిక మూత్రం, మూత్రం తెల్లగా ఉండటం, ప్రోస్టేట్ గ్రంథి ఆపరేషన్లు, స్త్రీలలో మూత్రం నియంత్రించుకోలేకపోవడం, మూత్రనాళం, మూత్రాశయంలో రాళ్లు, కిడ్నీల్లో రాళ్లు, మూత్రపిండాలు, మూత్రనాళం,మూత్రాశయం సంబంధిత క్యాన్సర్లు, బీర్జమునకు సంబంధించిన ఆపరేషన్లు, సెక్సువల్ సమస్యలు, సంతానలేమి సమస్యలు, కిడ్నీ ఫెయిల్యూర్ సమస్యలు, కిడ్నీ వాపు సమస్యలు, చెడిపోయిన కిడ్నీ తొలగించుట, చిన్నపిల్లలో మూత్రనాళ సమస్యలకు మిత్ర హాస్పిటల్లోని యూరాలజీ విభాగంలో అత్యాధునిక వైద్య సేవలు అందుబాటులో ఉన్నాయని డాక్టర్ సతీష్ తెలియజేశారు. ప్రస్తుతం అందుబాటులోకి వచ్చిన థులియం ఫైబర్ లేజర్ ద్వారా అత్యంత కచ్చితత్వంతో కిడ్నీలో రాళ్లు, ప్రొస్టేట్ తదితర చికిత్సలను నిర్వహిస్తామని ఆయన పేర్కొన్నారు.ఈ సమావేశంలో ఆర్థోపెడిక్ సర్జన్ డాక్టర్ కె. దుర్గా నాగరాజు, పీడియాట్రిక్ అండ్ నియోనేటల్ సర్జన్ డాక్టర్ కె.వి. రవికుమార్, అనస్థిషియాలజిస్ట్ డాక్టర్ పి. విశ్వేశ్వరరావు పాల్గొన్నారు.
తాజా వార్తలు
- గిన్నిస్ రికార్డుకు సిద్ధమవుతున్న అయోధ్య!
- కువైట్ లో ది లీడర్స్ కాన్క్లేవ్..!!
- సౌదీలో 23,094 మంది అరెస్టు..!!
- బహ్రెయిన్ లో మెసేజ్ స్కామ్స్ పెరుగుదల..!!
- ప్రపంచ శాంతికి ఖతార్ కృషి..!!
- బర్నింగ్ డాల్ ట్రెండ్ పై దుబాయ్ పోలీసుల వార్నింగ్..!!
- ROHM లో స్టార్ డయానా హద్దాద్ కాన్సర్ట్..!!
- దోహా చర్చలతో పాకిస్థాన్-ఆఫ్ఘనిస్థాన్ శాంతి ఒప్పందం
- శంకర నేత్రాలయ USA తమ 'అడాప్ట్-ఎ-విలేజ్' దాతలకు అందిస్తున్న ఘన సత్కారం
- నవంబర్ 14, 15న సీఐఐ భాగస్వామ్య సదస్సు–ఏర్పాట్ల పై సీఎం చంద్రబాబు సమీక్ష