విమాన టికెట్ కోసం పిల్లల వయస్సు ఎంత ఉండాలి?

- April 16, 2025 , by Maagulf
విమాన టికెట్ కోసం పిల్లల వయస్సు ఎంత ఉండాలి?

ఫ్లయిట్లో జర్నీ అంటే ఎవరికీ ఇష్టం ఉండదు చెప్పండి. ఈ రోజుల్లో అయితే చాలా మంది హాలిడేస్ సమయంలో ఫారెన్ టిప్స్ ప్లాన్ చేసుకొని మరీ ఫ్లయిట్లో జర్నీ చేస్తుంటారు. విహార యాత్రలు, ఫ్రెండ్స్ & ఫ్యామిలీ టూర్స్ ఇలా ఎక్కడికైనా ప్రయాణించాలనుకుంటే ఫ్లయిట్లో అలసిపోకుండా హాయిగా ప్రయాణించొచ్చు. కొన్ని సందర్భాల్లో ఎయిర్ లైన్స్ సంస్థలు ఆఫర్లు, డిస్కౌంట్స్ కూడా అందిస్తుంటాయి. విమాన ప్రయాణీకులకి సంబంధించి చాల విమానయాన సంస్థలు మార్గదర్శకాలను జారీ చేస్తాయి.ముఖ్యంగా పిల్లలతో విమానంలో ప్రయాణించడానికి కూడా కొన్ని రూల్స్ కూడా రూపొందించాయి.అయితే పిల్లలు విమానంలో ప్రయాణించడానికి ఎంత వయసు ఉండాలి.. పిల్లలకి ఎన్ని సంవత్సరాల తర్వాత ఫ్లయిట్ టిక్కెట్లు కొనడం అవసరం..అసలు పిల్లలకు విమానంలో ఎలాంటి సౌకర్యాలు లభిస్తాయో మీకు తెలుసా?

2 సంవత్సరాల కంటే తక్కువ వయస్సు పిల్లలకు
మీ పిల్లలకి 2 సంవత్సరాల కంటే తక్కువ వయస్సు ఉంటే, మీరు విమానంలో సీటు కోసం ప్రత్యేకంగా టికెట్ తీసుకోవలసిన అవసరం లేదు. అలాగే మీరు 2 సంవత్సరాల కంటే తక్కువ వయస్సు ఉన్న పిల్లలని ఫ్రీగా మీ వెంట తీసుకొని ప్రయాణించవచ్చు. ఒకవేళ మీ పిల్లల వయస్సు 2 నుండి 12 సంవత్సరాల మధ్య ఉంటే విమానంలో వారికీ సీటు తప్పనిసరి. విమానయాన సంస్థలు 12 ఏళ్లు పైబడిన పిల్లలను అడల్ట్ ప్రయాణికులుగా పరిగణిస్తాయి. ఈ కారణంగా 12 సంవత్సరాల కంటే ఎక్కువ వయస్సు ఉన్న పిల్లలకి ఫుల్ టికెట్ కొనడం తప్పనిసరి.

పిల్లల టిక్కెట్లకు కూడా ఒక రూల్
కొన్ని విమానయాన సంస్థల్లో ప్రయాణించడానికి చిన్న పిల్లలకు కిడ్స్ టిక్కెట్లు కొనడం అవసరం. పిల్లల టిక్కెట్లు పెద్దల టిక్కెట్ల కంటే తక్కువ ఖర్చుతో ఉంటాయి. అంతేకాకుండా పిల్లల కోసం విమానయాన సంస్థలు ప్రత్యేక రకమైన సీట్లను అందిస్తాయి. 5 సంవత్సరాల వయస్సు తర్వాత ఒంటరిగా ప్రయాణించవచ్చు: విమానంలో ఒంటరిగా ప్రయాణించడం గురించి మాట్లాడుకుంటే, 5 సంవత్సరాల కంటే ఎక్కువ వయస్సు ఉన్న పిల్లలు ఒంటరిగా ప్రయాణించవచ్చు. విమానంలో పిల్లల ప్రయాణానికి సంబంధించి ప్రతి విమానయాన సంస్థకు వేర్వేరు రూల్స్ ఉన్నాయి.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com