కొత్త ఆల్ టైమ్ గరిష్ట స్థాయికి చేరుకున్న బంగారం ధరలు..!!
- April 17, 2025
దుబాయ్: బుధవారం సాయంత్రం బంగారం ధరలు కొత్త రికార్డు గరిష్ట స్థాయికి చేరుకున్నాయి. ప్రపంచవ్యాప్తంగా దుబాయ్లో గ్రాముకు Dh400 కంటే తక్కువగా ఔన్సుకు $3,300 దాటింది. అమెరికా-చైనా సుంకాల యుద్ధం, బలహీనమైన డాలర్ కారణంగా విలువైన బంగారం ధరలు ఔన్సుకు $3,300 దాటిపోయాయి. దుబాయ్లో 24K గ్రాముకు Dh400 కు కొద్దిగా తక్కువగా ఉంది. ఇతర వేరియంట్లలో 22K, 21K, 18K వరుసగా గ్రాముకు Dh369.5, Dh354.5, Dh303.75 లకు పెరిగాయి. పెరుగుతున్న వాణిజ్య ఉద్రిక్తతలు, నిరంతర అనిశ్చితి కారణంగా ప్రపంచ ఆర్థిక వ్యవస్థ మాంద్యం వైపు పయనిస్తోందని యూఎన్ ట్రేడ్ అండ్ డెవలప్మెంట్ (UNCTAD) హెచ్చరించింది. అమెరికా, చైనా ఇతర దేశాల మధ్య ప్రపంచ సుంకాల యుద్ధం మరింత పెరిగితే, సురక్షితమైన బంగారంలో పెట్టుబడులు పెరుగుతాయని, దాంతో వాటి ధరలు మరింత పెరిగే అవకాశం ఉంటుందని విశ్లేషకులు భావిస్తున్నారు.ఆర్థిక సంస్థలు ఇటీవల బంగారం ధర అంచనాలను సంవత్సరాంతానికి $3,700, 2026 మధ్య నాటికి $4,000 కు పెరుగుతాయని సాక్సో బ్యాంక్ కమోడిటీ స్ట్రాటజీ హెడ్ ఓలే హాన్సెన్ విశ్లేషించారు.
తాజా వార్తలు
- సంక్రాంతికి కొత్త ఆఫీసులోకి ప్రధాని..
- గల్ఫ్ కార్మికుల మానవత్వం
- యూఏఈలో ఘనంగా సంక్రాంతి వేడుకలు
- ఒక్కరోజు విరామం తీసుకుందామంటే ఏదో ఒక పని పడుతోంది: సీఎం రేవంత్
- టీసీఎస్ లాభం రూ.10657 కోట్లు..
- యుద్ధ కళల్లో పవన్ కల్యాణ్ కు అంతర్జాతీయ గుర్తింపు
- దుబాయ్ హిట్ అండ్ రన్ కేసు.. ఇంకా ఐసియులోనే గర్భిణి..!!
- వెనెజువెలా అధ్యక్షుడుగా తనకు తానే ప్రకటించుకున్న ట్రంప్
- భారత్ అమ్ములపొదిలో చేరిన అత్యాధునిక మిస్సైల్
- సౌదీలో రైడ్-హెయిలింగ్ యాప్ కు ఫుల్ డిమాండ్..!!







