సినిమా రివ్యూ: ‘ఓదెల 2’
- April 17, 2025
హెబ్బా పటేల్, వశిష్ట సింహా ప్రధాన పాత్రల్లో అస్సలేమాత్రం ఎక్స్‌పెక్టేషన్స్ లేకుండా తెరకెక్కిన చిత్రమే ‘ఓదెల’. ఈ సినిమాకి ఓటీటీలో మంచి రెస్పాన్స్ వచ్చింది. దాంతో, స్టార్‌డమ్ జోడించి, ఇంకాస్త లార్జ్ స్కేల్‌లో తెరకెక్కించిన చిత్రమే ‘ఓదెల 2’. తమన్నా భాటియా ప్రధాన పాత్రలో నటించింది. సంపత్ నంది అందించిన స్టోరీకి, అశోక్ తేజ దర్శకత్వం వహించాడు. తమన్నా ఎంట్రీతో ఈ సినిమాపై భారీగా అంచనాలు నెలకొన్నాయ్. ప్రమోషన్లు కూడా ఆ స్థాయిలోనే నిర్వహించారు. మరి, ‘ఓదెల 2’ ఆ స్థాయిలో అంచనాల్ని అందుకుందా .? లేదా.? తెలియాలంటే కథలోకి వెళ్లాల్సిందే.!
కథ:
తిరుపతి (వశిష్ట సింహా) ఓ కామాంధుడు. ఓదెల అనే గ్రామంలో నూతన వధువులపై తన కామ వాంఛ తీర్చుకుని వాళ్లని చంపేస్తుంటాడు. ఆ విషయం తెలుసుకున్న తిరుపతి భార్య రాధ (హెబ్బా పటేల్) అతని తలని నరికి పోలీస్ స్టేషన్‌లో లొంగిపోతుంది. అక్కడ ఎండ్ అవుతుంది ‘ఓదెల’ మొదటి పార్ట్. అక్కడి నుంచే రెండో పార్ట్ స్టార్ట్ అవుతుంది. తిరుపతి చావుతో గ్రామానికి పట్టిన పీడ విరగడయ్యిందనుకుంటారు గ్రామ ప్రజలు. తిరుపతి శవానికి సమాధి శిక్ష వేసి పూడ్చి పెడతారు. దాంతో, తిరుపతి ఆత్మ గ్రామస్థులపై మరింత కక్ష పెంచుకుని ప్రేతాత్మగా మారిపోతుంది. దురదృష్టవశాత్తూ సమాధి నుంచి బయటికొచ్చిన ఆ ప్రేతాత్మ గ్రామంలోని చావులకు కారణమవుతుంటుంది. ఈ నేపథ్యంలోనే నిరంతరం శివుని సేవలో తరించే నాగ సాధువు భైరవి (తమన్నా) ఓదెల గ్రాామానికి వస్తుంది. ఈ ప్రేతాత్మ పీడ నుంచి గ్రాామాన్ని కాపాడాలని గ్రామస్థులు భైరవిని వేడుకుంటారు.? తనకున్న దైవ శక్తితో భైరవి, ఓదెల గ్రామానికి పట్టిన ప్రేతాత్మ పీడను తొలగించగలిగిందా.? అందుకోసం ఆమె చేసిన త్యాగం ఏంటీ.? అనేది తెలియాలంటే ‘ఓదెల 2’ ధియేటర్లలో చూడాల్సిందే.
నటీనటుల పని తీరు:
శివ శక్తిగా తమన్నా భాటియా పాత్ర ఈ సినిమాకి ఓ కొత్తదనం. ఆ పాత్రలో తమన్నా చాలా హుందాగా.. ఆధ్యాత్మిక వైబ్స్ క్రియేట్ అయ్యేలా తన బాడీ లాంగ్వేజ్‌ని మేకోవర్ చేసుకుంది. మొదటి పార్ట్‌లో ఇంపార్టెంట్ రోల్ అయిన హెబ్బా పటేల్‌కి ఈ సినిమాలో గెస్ట్ రోలే దక్కింది. తమన్నా పాత్ర ముందు హెబ్బా పటేల్ కొట్టుకుపోయింది. ఇక, మరో ఇంపార్టెంట్ రోల్ ఈ సినిమాకి వశిష్ట పాత్ర.. భయంకరమైన ప్రేతాత్మగా.. కనిపించింది తక్కువ సేపే అయినా తన గంభీరమైన గాత్రంతో చాలా ఇంపాక్ట్ క్రియేట్ చేశాడు. మురళీ శర్మ పాత్ర ‘అరుంధతి’ సినిమాలో షియాజీ షిండే పాత్రను గుర్తు చేస్తుంది. మిగిలిన పాత్రధారులు తమ పరిధి మేర నటించి మెప్పించారు.
సాంకేతిక వర్గం పనితీరు:
దైవ శక్తి, వెర్సస్ దుష్టశక్తి... ఈ కాన్సెప్ట్‌లో ఇంత వరకూ చాలానే సినిమాలొచ్చాయ్. కానీ, ఈ తరహా సినిమాలు ఎప్పటికీ బోర్ కొట్టవు. కూసింతైనా కొత్తదనం చూపిస్తే.. అవి మరింత ఆదరణ దక్కించుకుంటాయ్. అయితే, ‘ఓదెల 2’లో కొత్తదనం ఏమీ కనిపించకపోయినా.. కొన్ని సీన్లు థ్రిల్ కలిగిస్తాయ్. ముఖ్యంగా ఇలాంటి సినిమాలకు వీఎఫ్ఎక్స్ ఎఫెక్టులే ప్రాణం. ఆ వర్క్ ఈ సినిమాకి చక్కగా కుదిరింది. అలాగే సినిమాటోగ్రఫీ చాలా బాగుంది. ఓదెల గ్రామాన్ని.. అక్కడి గ్రామస్థుల మూడ్‌నీ చాలా నేచురల్‌గా చూపించారు. మరో మెయిన్ అస్సెట్ బీజీఎమ్. సన్నివేశంలో పెద్దగా పస లేకపోయినా బ్యాక్ గ్రౌండ్ స్కోర్‌తో ప్రేక్షకుడికి థ్రిల్ క్రియేట్ చేశారు. నిర్మాణ విలువలు బడ్జెట్‌కి మించి అనేలా స్క్రీన్ మీద కనిపిస్తాయ్. 20 కోట్ల బడ్జెట్ సినిమాలా అస్సలు అనిపించదు. క్వాలిటీ చాలా బాగుంది. ఓవరాల్‌గా ఈ సినిమాకి కథ, కథనం రొటీనే అయినా టెక్నికల్ టీమ్ వర్క్ మాత్రం ఎక్స్‌లెంట్ అని చెప్పడం అతిశయోక్తి అనిపించదు. తమన్నా పాత్ర ఎంట్రీకి ఇచ్చిన ఎలివేషన్ సీన్లు.. ప్రీ క్లైమాక్స్ మరియు క్లైమాక్స్ సన్నివేశాలు అత్యద్భుతంగా అనిపిస్తాయ్. ఫస్టాఫ్ రొటీన్‌గానే అనిపించినా ఇంటర్వెల్ బ్యాంగ్‌లో తమన్నా ఎంట్రీ తర్వాత సినిమా పుంజుకుంటుంది. సెకండాఫ్ అంతా విజువల్స్, వీఎఫ్‌ఎక్స్‌తోనే కట్టిపడేశారు. అయితే కథ పరంగా పతాక సన్నివేశాల్లో ప్రేతాత్మని సంహరించడానికి సాక్షాత్తూ పరమ శివుడే దిగా రావల్సినంత అవసరం ఈ కథకి లేదనిపిస్తుంది. చాలా సన్నివేశాల్లో ‘అరుంధతి’ చిత్రాన్ని తలపుకు తీసుకొస్తుంటుంది. అక్కడక్కడా ‘అఖండ’, అమ్మోరు’ సినిమాల షేడోస్ కూడా ప్రేక్షకులు స్పురణకి తెచ్చుకుంటుంటారు.
ప్లస్ పాయింట్స్:
తమన్నా నటన, విజువల్ ఎఫెక్ట్స్, బ్యాక్ గ్రౌండ్ స్కోర్, పతాక సన్నివేశాలు మొదలైనవి..
మైనస్ పాయింట్స్:
కొత్తదనం లేని కథ, కథనం, సాగతీతలా అనిపించిన ఫస్టాఫ్,
చివరిగా:
హారర్, థ్రిల్లర్ సినిమాల్ని ఇష్టపడే వారికి ‘ఓదెల 2’ టెక్నికల్లీ ఓ మంచి ధియేటర్ ఎక్సైపీరియన్స్.
తాజా వార్తలు
- హైదరాబాద్ లో పలు చోట్ల వర్షం
- ఢిల్లీలోని పాక్ హైకమిషన్‌లో ఐఎస్ఐ ఏజెంట్..
- ఎన్నారై టిడిపి చొరవతో ఒమాన్ నుండి ఏపీకి చేరుకున్న యువకులు
- ట్రంప్ మిడిలీస్ట్ పర్యటనను ప్రారంభం..తొలి విదేశీ పర్యటన..!!
- కువైట్ ప్రైవేట్ ఫార్మసీలలో 69 మెడిసిన్ ధరలపై నియంత్రణ..!!
- జాసిమ్ బిన్ హమద్ స్ట్రీట్ లో ట్రాఫిక్ ఆంక్షలు..మూసివేత..!!
- రియాద్‌లో బైక్ డెలివరీ ఆర్డర్లు నిలిపివేత..!!
- CBSE 12వ తరగతి పరీక్ష ఫలితాలు విడుదల..!!
- పార్కింగ్ వివాదం.. ముగ్గురు మహిళలను కాల్చిచంపిన నిందితుడు..!!
- జార్ఖండ్‌లో శస్త్రచికిత్స శిబిరాలు నిర్వహించిన శంకర నేత్రాలయ