ATM దుబాయ్ 2025.. ఆకట్టుకుంటున్న ఖతార్ ఎయిర్‌వేస్ 'Qsuite నెక్స్ట్ జెన్'..!!

- April 18, 2025 , by Maagulf
ATM దుబాయ్ 2025.. ఆకట్టుకుంటున్న ఖతార్ ఎయిర్‌వేస్ \'Qsuite నెక్స్ట్ జెన్\'..!!

దోహా: ఖతార్ ఎయిర్‌వేస్ ఈ సంవత్సరం అరేబియన్ ట్రావెల్ మార్కెట్ (ATM) దుబాయ్‌కి 'Qsuite నెక్స్ట్ జెన్'తో అత్యాధునిక ఎయిర్‌లైన్ లగ్జరీని తీసుకువస్తోంది. ఇది మల్టీ అవార్డు గెలుచుకున్న పేటెంట్ పొందిన Qsuite బిజినెస్ క్లాస్ తాజా ఉత్పత్తి. ఏప్రిల్ 28 నుండి మే 1 వరకు ఖతార్ ఎయిర్‌వేస్ ఉత్పత్తి చూడవచ్చని ప్రతినిధులు తెలిపారు. 

ఖతార్ ఎయిర్‌వేస్ ట్రావెల్, బిజినెస్ క్లాస్ కోసం పరిశ్రమ బెంచ్‌మార్క్‌ను Qsuite నెక్స్ట్ జెన్ డిజైన్ ద్వారా సెట్ చేస్తోందని, ఇది పూర్తిగా డిజైన చేసిన క్వాడ్ సూట్‌లను కలిగి ఉంటుందన్నారు. ఇది నాలుగు గ్రూప్స్, విండో ఐసెల్ కంపానియన్ సూట్‌ల కోసం ఆకాశంలో అతిపెద్ద సఫరేట్ స్థలాన్ని అందిస్తుందని పేర్కొన్నారు. అన్ని సూట్‌లలో 4K OLED ఇన్-ఫ్లైట్ ఎంటర్‌టైన్‌మెంట్ స్క్రీన్‌లు ఉన్నాయని తెలిపారు

ఈ సంవత్సరం ATM థీమ్ "గ్లోబల్ ట్రావెల్: డెవలపింగ్ టుమారోస్ టూరిజం త్రూ ఎన్హాన్స్డ్ కనెక్టివిటీ"తో కనెక్ట్ అవుతామని, కస్టమర్ అనుభవంలో తన నిరంతర ఇన్వెస్ట్ మెంట్ ను  ఖతార్ ఎయిర్‌వేస్ టెక్నాలజీ హైలైట్ చేసింది. ఇలాంటి ఆవిష్కరణలు ప్రపంచ విమానయాన రంగంలో లీడర్ గా తన స్థానాన్ని బలోపేతం చేస్తుందని పేర్కొంది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com