సౌదీలో పార్శిల్ షిప్మెంట్లకు TGA జాతీయ చిరునామా తప్పనిసరి..!!
- April 18, 2025
రియాద్: జనవరి 1, 2026 నుండి అన్ని పార్శిల్ డెలివరీ కంపెనీలు అన్ని మెయిల్ షిప్మెంట్లలో జాతీయ చిరునామాను చేర్చడం తప్పనిసరి అని జనరల్ ట్రాన్స్పోర్ట్ అథారిటీ (TGA) వెల్లడించింది. పార్శిల్ డెలివరీ రంగం సామర్థ్యాన్ని పెంచడానికి, లబ్ధిదారులకు సేవా డెలివరీని మెరుగుపరచడానికి TGA చేస్తున్న ప్రయత్నాలలో ఈ నిర్ణయం భాగమని తెలిపారు. కస్టమర్ అనుభవాన్ని ఆప్టిమైజ్ చేయడం, డెలివరీ ప్రక్రియలను వేగవంతం చేస్తుందన్నారు. కొత్త నిబంధన అమలుతో పార్శిల్ డెలివరీ కంపెనీలలో అధిక ఖచ్చితత్వం, కార్యాచరణ సామర్థ్యం సాధించవచ్చని భావిస్తున్నారు.
వ్యక్తులు తమ జాతీయ చిరునామాను నాలుగు డిజిటల్ ప్లాట్‌ఫారమ్‌ల (అబ్షేర్, తవక్కల్నా, సెహ్హతి , ఎస్పీఎల్) ద్వారా సులభంగా యాక్సెస్ చేయవచ్చని TGA స్పష్టం చేసింది. ప్రముఖ ప్రపంచ లాజిస్టిక్స్ హబ్‌గా సౌదీ అరేబియా స్థానాన్ని పటిష్టం చేయడం అనే దాని లక్ష్యానికి అనుగుణంగా కొత్త నిర్ణయాలు తీసుకుంటున్నట్లు తెలిపింది.
రమదాన్ సందర్భంగా, లైసెన్స్ పొందిన కంపెనీలు నిర్వహించే పోస్టల్ షిప్మెంట్ల పరిమాణం 26 మిలియన్లను దాటిందని, ఇది గత సంవత్సరం ఇదే కాలంతో పోలిస్తే 18 శాతం వృద్ధి రేటును సూచిస్తుందని TGA వెల్లడించింది.
తాజా వార్తలు
- ఒమన్‌లో అల్లర్లు..59 మంది ప్రవాసులకు జైలు శిక్ష..!!
- నిర్వహణ పనుల కోసం రోడ్ మూసివేత..!!
- కువైట్‌లో ఘనంగా ప్రపంచ హిందీ దినోత్సవం..!!
- 30 మిలియన్ దిర్హమ్స్ గెలుచుకున్న ఫిలిపినో ప్రవాసి..!!
- సౌదీ అరేబియాలో 18,836 మంది అరెస్టు..!!
- జల్లాక్లో తమిళ డయాస్పోరా మత్స్యకారుల పొంగల్..!!
- 8వ వేతన సంఘం పై బిగ్ అప్డేట్..
- అమెరికాలోనే భారీగా ఆయిల్ నిల్వలు..
- తెలంగాణ మున్సిపల్ బరిలో జనసేన
- సంక్రాంతికి ఊరెళ్తున్నారా?సీపీ సజ్జనార్ కీలక సూచనలు







