ప్రత్యేక ఆర్థిక మండలాలకు ట్యాక్స్ బెనిఫిట్స్.. సౌదీ అరేబియా
- April 18, 2025
రియాద్: ప్రత్యేక ఆర్థిక మండలాలకలో విదేశీ ప్రతిభను ఆకర్షించడంతో పాటు తన పెట్టుబడులను ఆకర్షించేందుకు సౌదీ అరేబియా విస్తృత ప్రచారాన్ని ప్రారంభించింది. ఇందులో భాగంగా ప్రోత్సాహకాలు అందించడంతోపాటు ట్యాక్స్ మినహాయింపులను ప్రకటించింది. ఆర్థిక నగరాలు, ప్రత్యేక మండలాల అథారిటీ (ECZA).. జకాత్, పన్ను, కస్టమ్స్ అథారిటీ, మానవ వనరులు, సామాజిక అభివృద్ధి మంత్రిత్వ శాఖతో కలిసి ట్యాక్స్, కస్టమ్స్ మినహాయింపులను అందించడానికి, అలాగే వీసా జారీని సులభతరం చేయడానికి, విదేశీ ప్రతిభకు ఆర్థిక సమానత్వ మినహాయింపులను అందించడానికి సహకరిస్తోంది.
సౌదీలోని ప్రత్యేక ఆర్థిక మండలాల్లో (SEZలు) పెట్టుబడిదారులకు లక్ష్య ప్రోత్సాహకాలు, ప్రత్యేక ప్రయోజనాలను అందించడానికి కీలకమైన సౌదీ ప్రభుత్వ సంస్థలతో ECZA వ్యూహాత్మక భాగస్వామ్యాలను ఈ ప్రచారం సందర్భంగా ECZA సెక్రటరీ జనరల్ నబిల్ ఖోజా ప్రకటించారు.
సౌదీ మార్కెట్లోకి ఉత్పత్తులు,సేవల ప్రవేశాన్ని సులభతరం చేయడానికి ECZA సౌదీ ప్రమాణాలు, మెట్రాలజీ, నాణ్యత సంస్థ (SASO), సౌదీ ఫుడ్ అండ్ డ్రగ్ అథారిటీ (SFDA)తో కూడా భాగస్వామ్యం కలిగి ఉంది.
తాజా వార్తలు
- ఒమన్‌లో అల్లర్లు..59 మంది ప్రవాసులకు జైలు శిక్ష..!!
- నిర్వహణ పనుల కోసం రోడ్ మూసివేత..!!
- కువైట్‌లో ఘనంగా ప్రపంచ హిందీ దినోత్సవం..!!
- 30 మిలియన్ దిర్హమ్స్ గెలుచుకున్న ఫిలిపినో ప్రవాసి..!!
- సౌదీ అరేబియాలో 18,836 మంది అరెస్టు..!!
- జల్లాక్లో తమిళ డయాస్పోరా మత్స్యకారుల పొంగల్..!!
- 8వ వేతన సంఘం పై బిగ్ అప్డేట్..
- అమెరికాలోనే భారీగా ఆయిల్ నిల్వలు..
- తెలంగాణ మున్సిపల్ బరిలో జనసేన
- సంక్రాంతికి ఊరెళ్తున్నారా?సీపీ సజ్జనార్ కీలక సూచనలు







