4 ఆరోగ్య సంరక్షణ వృత్తులలో పెరిగిన సౌదీకరణ రేట్లు..!
- April 19, 2025
రియాద్: సౌదీ అరేబియా లో ప్రైవేట్ రంగంలోని నాలుగు ఆరోగ్య సంరక్షణ వృత్తులలో స్థానికీకరణ రేట్లను పెంచే నిర్ణయాన్ని అమల్లోకి వచ్చింది. ఈ నిర్ణయం ప్రకారం, సౌదీకరణ రేట్లు రేడియాలజీలో 65 శాతం.. క్లినికల్ న్యూట్రిషన్, ఫిజియోథెరపీలో 80 శాతం, వైద్య ప్రయోగశాలలలో 70 శాతంగా నిర్ణయించారు. మానవ వనరులు మరియు సామాజిక అభివృద్ధి మంత్రిత్వ శాఖ (MHRSD), ఆరోగ్య మంత్రిత్వ శాఖతో భాగస్వామ్యంతో ప్రైవేట్ రంగంలోని ఈ వృత్తులలో సౌదీకరణ రేట్లను పెంచే నిర్ణయం మొదటి దశను అమలు చేస్తున్నట్లు ప్రకటించారు.
అదేవిధంగా నిపుణులు, సాంకేతిక నిపుణులకు కనీస వేతనాలు వరుసగా SR7,000, SR5,000గా నిర్ణయించారు. ఈ నిర్ణయం మొదటి దశ రియాద్, మక్కా, మదీనా, జెడ్డా, దమ్మామ్ మరియు అల్-ఖోబార్ ప్రధాన నగరాల్లో ఒకటి లేదా అంతకంటే ఎక్కువ మంది కార్మికులను నియమించే అన్ని సంస్థలకు వర్తిస్తుందని.. మిగిలిన ప్రాంతాలలోని పెద్ద, మెగా సంస్థలకు కూడా వర్తిస్తుందని పేర్కొంది.
రెండవ దశ అమలు అక్టోబర్ 17నుండి అమల్లోకి వస్తుందని, ఇది రాజ్యం అంతటా వివిధ ప్రాంతాలలో మిగిలిన సంస్థలను కవర్ చేస్తుందని వెల్లడించారు.
తాజా వార్తలు
- సాంస్కృతిక సహకారంపై సౌదీ అరేబియా, ఇండియా చర్చలు..!!
- ఎట్టకేలకు ఐపీఎల్ 2026 వేలం పై బిగ్ అప్డేట్ వచ్చేసింది..
- శంకర ఐ కేర్ భవనాన్ని ప్రారంభించిన సీఎం చంద్రబాబు
- ఉర్దూ భాషాభివృద్ధికి కృషి చేసిన వారికి అవార్డుల ప్రధానం చేయనున్న మంత్రి ఫరూక్
- డిసెంబర్ 12 నుండి 14 వరకు దుబాయ్ వేదికగా ప్రపంచ తెలుగు ఐటీ మహాసభలు
- సైబర్ నేరాల పై ప్రజలు అప్రమత్తంగా ఉండాలి
- 1,750 కుటుంబాలకు QR34 మిలియన్లు పంపిణీ..!!
- వారంలో రోజుల్లో 12,098 మందిపై బహిష్కరణ..!!
- ఆ మూడు ఎయిర్ లైన్సుల్లో బ్లూటూత్ ఇయర్ఫోన్లపై నిషేధం..!!
- కువైట్ ఉప ప్రధానమంత్రితో కేరళ ముఖ్యమంత్రి భేటీ..!!







