కువైట్ లో హెల్త్ ప్రొఫెషనల్స్ సర్టిఫికెట్ వెరిఫికేషన్ సిస్టమ్ అప్డేట్..!!
- April 20, 2025
కువైట్: కువైట్‌లో పనిచేయడానికి దరఖాస్తు చేసుకునే హెల్త్ ప్రొఫెషనల్స్ సమర్పించే సర్టిఫికెట్ల వెరిఫికేషన్ సిస్టమ్ అప్డేట్ చేస్తున్నట్లు ఆరోగ్య మంత్రిత్వ శాఖ ప్రకటించింది. ఆరోగ్య సంరక్షణ రంగంలో అత్యున్నత ప్రమాణాలను నెలకొల్పేందుకు, అదే విధంగా హెల్త్ ప్రొఫెషనల్స్ సామర్థ్యం, వృత్తి నైపుణ్యాన్ని నిర్ధారించడానికి మెరుగైన వెరిఫికేషన్ సిస్టమ్ ను తీసుకురానున్నట్లు మంత్రిత్వ శాఖ వెల్లడించింది. విద్యా అర్హతలు, అనుభవం, వృత్తిపరమైన లైసెన్స్‌లు, హెల్త్ ప్రొఫెషనల్స్ ప్రవర్తన, నేర నేపథ్య తనిఖీలను ధృవీకరించడానికి అధునాతన విధానాలను ప్రవేశపెట్టినట్లు మంత్రిత్వ శాఖ ఒక పత్రికా ప్రకటనలో తెలిపింది.
అప్‌గ్రేడ్ చేసిన వ్యవస్థ ఎలక్ట్రానిక్ హెల్త్ లైసెన్సింగ్ ప్లాట్‌ఫామ్‌తో పూర్తిగా కనెక్ట్ అయి ఉంటుందని.. ఎలక్ట్రానిక్ హెల్త్ లైసెన్సింగ్ ప్లాట్‌ఫామ్ ద్వారా ప్రకటించిన నిబంధనలకు అనుగుణంగా అన్ని అవసరమైన పత్రాలను సమర్పించాలని మంత్రిత్వ శాఖ దరఖాస్తుదారులను కోరింది.
తాజా వార్తలు
- దుబాయ్ లో స్కూల్ బస్ పూలింగ్
- ఢిల్లీలోని కేంద్ర మంత్రి మురుగన్ నివాసంలో పొంగల్ సంబరాలు
- ప్రమాదకర స్టూడెంట్ ఛాలెంజ్‌ల పై తల్లిదండ్రులకు DHA హెచ్చరిక
- శబరిమలలో మకర జ్యోతి దర్శనం..పరవశించిన అయ్యప్ప భక్తులు
- తిరుపతి: ప్రజల ఆరోగ్యానికి స్విమ్స్ ప్రత్యేక హెల్త్ చెకప్ ప్యాకేజీలు
- ఏపీ: రాష్ట్రానికి రూ.567 కోట్లు నిధులు విడుదల చేసిన కేంద్రం
- సౌదీ అరేబియాలో ఘనంగా SATA ER సంక్రాంతి సంబరాలు–2026
- ఆన్లైన్ షాపింగ్ సులభం చేసే కొత్త ఫీచర్
- డిజిపి చేతుల మీదుగా ‘కాల్ ఫర్ బ్లడ్’ వెబ్ యాప్ ప్రారంభం
- చైనాలో ఒంటరిగా ఉండేవారిని కాపాడే యాప్







