దివంగత పోప్ ఫ్రాన్సిస్ కోసం యూఏఈలో ప్రత్యేక ప్రార్థనలు..!!
- April 22, 2025
యూఏఈ: యూఏఈలోని కాథలిక్ చర్చిలకు దివంగత పోప్ ఫ్రాన్సిస్ కోసం పవిత్ర ప్రార్థనలు నిర్వహించాలని దక్షిణ అరేబియా (అవోసా) అపోస్టోలిక్ వికార్, బిషప్ పాలో మార్టినెల్లి OFM క్యాప్ పిలుపునిచ్చారు.
“దక్షిణ అరేబియాలోని అపోస్టోలిక్ వికారియేట్‌లోని చర్చికి ఆయన చేసిన గొప్ప సేవకు ఎల్లప్పుడూ కృతజ్ఞతతో ఉంటారు. ముఖ్యంగా యూఏఈలోని ప్రజలందరూ పోప్ ఫ్రాన్సిస్ మరణం పట్ల చాలా బాధపడ్డారు. ఆయనను 2019లో అబుదాబి సందర్శించినందుకు కృతజ్ఞతతో గుర్తుంచుకుంటాము.” అని ఇటాలియన్ బిషప్ సోమవారం ఫేస్‌బుక్ పోస్ట్‌లో తెలిపారు. ప్రభువు పోప్ ఫ్రాన్సిస్‌ను స్వర్గపు నివాసంలోకి స్వీకరించి, ఆయనకు శాశ్వత శాంతిని ప్రసాదించుగాక అని మార్టినెల్లి పేర్కొన్నారు.
అవోసా ఇంకా ప్రత్యేక ప్రార్థనల సమయాలను వెల్లడించలేదు. కానీ చాలా కాథలిక్ చర్చిలలో ఔద్ మెథాలోని సెయింట్ మేస్ కాథలిక్ చర్చి, జెబెల్ అలీలోని సెయింట్ ఫ్రాన్సిస్ ఆఫ్ అస్సిసి కాథలిక్ చర్చి, షార్జాలోని సెయింట్ మైఖేల్స్ చర్చితో సహా సాయంత్రం 7 గంటలకు రోజువారీ ప్రార్థనలు జరుగుతాయి.
తాజా వార్తలు
- కువైట్ లో వాటర్ కొరత..కీలక సూచనలు..!!
- సౌదీలో అక్రమ డ్రైవర్ల పై ఉక్కుపాదం..!!
- సెప్టెంబర్‌లో ఖతార్ కు పోటెత్తిన ప్యాసింజర్స్..!!
- స్వీట్లు తినిపించి పిల్లల గొంతుకోసి చంపిన తండ్రి
- షార్జాలో జైవాకర్ల పై కఠిన చర్యలు..!!
- యూరప్‌కు వెళుతున్నారా? అమల్లోకి వచ్చిన న్యూ రూల్స్..!!
- BHD 52,000 VAT ఎగవేతపై దర్యాప్తు పూర్తి..!!
- భారత్‌కు అమెరికా కొత్త రాయబారిగా సెర్గియో గోర్ నియామకం
- ఇడాహోలో ఖతార్ ఎయిర్ ఫోర్స్.. అమెరికాతో ఒప్పందం..!!
- స్పేస్ సైన్స్.. అమెరికాలో 267 మంది సౌదీ స్టూడెంట్స్..!!