QNB ఎర్త్ దినోత్సవం.. పిల్లల కోసం ఆర్ట్ వర్క్ షాప్..!!
- April 23, 2025
దోహా, ఖతార్: పర్యావరణ సమస్యలపై సమాజంలో అవగాహన పెంచే లక్ష్యంతో ప్రతి సంవత్సరం ఏప్రిల్ 22న జరుపుకునే ఎర్త్ దినోత్సవం సందర్భంగా పిల్లల కోసం ఒక ప్రత్యేక కార్యక్రమాన్ని QNB నిర్వహించింది. యువతలో పర్యావరణ స్పృహతోపాటు వారిలో కళాత్మక నైపుణ్యాలను పెంపొందించడం కోసం కళా వర్క్షాప్ నిర్వహించింది. ఇందులో వివిధ అంశాలపై పిల్లలకు అవగాహన కల్పించారు. 7 నుండి 10 సంవత్సరాల వయస్సు గల పిల్లలతో 3D ఎర్త్ కార్డులను రూపొందించారు. పిల్లలు తమ చేతులను నీలం, ఆకుపచ్చ రంగుల్లో ముంచి కాన్వాస్పై కళాత్మక చిత్రాలను చిత్రీంచారు. చెట్లను నాటడం, సముద్రాలు, మహాసముద్రాలను కాలుష్యం నుండి రక్షించడం పై అవగాహన కల్పించినట్టు ఈ సందర్భంగా QNB గ్రూప్ కమ్యూనికేషన్స్ సీనియర్ ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ హెబా అల్ తమిమి తెలిపారు. పర్యావరణ అవగాహన కోసం ఒక సాధనంగా ఆర్ట్ ఉపయోగపడిందని, అదే సమయంలో పిల్లల్లో ఉన్న సృజనాత్మక సామర్థ్యాలను తెలుసుకునేందుకు ఇలాంటి వర్క్ షాప్ లు వీలు కల్పిస్తాయన్నారు.
QNB గ్రూప్ MEA ప్రాంతంలోని ప్రముఖ ఆర్థిక సంస్థలలో ఒకటి. ప్రాంతీయ మార్కెట్లో అత్యంత విలువైన బ్యాంకింగ్ బ్రాండ్లలో ఒకటిగా ఉంది. ఆసియా, యూరప్ , ఆఫ్రికా సహా 28 కి పైగా దేశాలలో ఇది సేవలు అందిస్తుంది. ప్రపంచవ్యాప్తంగా 31,000 మందికి పైగా నిపుణుల బృందంతో ఆవిష్కరణల మద్దతుతో సరికొత్త ఉత్పత్తులు, సేవలను అందిస్తుంది.
తాజా వార్తలు
- భారత్కు అమెరికా కొత్త రాయబారిగా సెర్గియో గోర్ నియామకం
- ఇడాహోలో ఖతార్ ఎయిర్ ఫోర్స్.. అమెరికాతో ఒప్పందం..!!
- స్పేస్ సైన్స్.. అమెరికాలో 267 మంది సౌదీ స్టూడెంట్స్..!!
- ఓవర్టేకింగ్, లేన్ స్కిప్పింగ్.. డ్రోన్లతో ట్రాఫిక్ పర్యవేక్షణ..!!
- అలెర్ట్: ఫుజైరాలో భారీ వర్షాలు..వాటర్ ఫాల్స్ కనువిందు..!!
- ప్రైవేట్ స్కూళ్లలో సంస్కరణలకు బహ్రెయిన్ శ్రీకారం..!!
- షురా కౌన్సిల్ ను సందర్శించిన భారత ప్రతినిధి బృందం..!!
- ఆర్చరీ ప్రీమియర్ లీగ్ విజయం తర్వాత ప్రధాని మోదీని కలిసిన రామ్ చరణ్
- ఘనంగా ఫిలింఫేర్ అవార్డుల ప్రదానోత్సవం..
- పాపికొండల విహారయాత్ర రీస్టార్ట్