దుబాయ్ లో ఘనంగా జరిగిన ముషాయిరా మరియు కవి సమ్మేళనం
- April 24, 2025
దుబాయ్: జస్న్ ఎ ఉర్దూను పురస్కరించుకుని 9వ వార్షిక ముషాయిరా & కవి సమ్మేళనం కార్యక్రమాన్ని ఈనెల ఏప్రిల్ 19, శనివారం రాత్రి 8 గంటల సమయంలో యూఏఈ దుబాయ్ లోని ఇండియన్ హై స్కూల్ నందు ఉన్న దుబాయ్ షేక్ రషీద్ ఆడిటోరియంలో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి బు అబ్దుల్లాహ్ ఇన్వెస్ట్మెంట్స్ కంపెనీ చైర్మన్ బు అబ్దుల్లాహ్ ముఖ్య అతిధిగా విచ్చేసారు.ప్రముఖ ఉర్దూ మరియు హిందీ భాషల కవులు ఈ కార్యక్రమంలో కవులు అలతి పదాలతో అల్లిన పద్యాలు, షాయిరీలతో ప్రేక్షకులను ఆకట్టుకున్నారు.ఈ కార్యక్రమానికి ప్రేక్షకులు భారీగా తరలివచ్చారు.ఊహించిన దాని కంటే కార్యక్రమం బాగా విజయవంతం కావడంతో నిర్వాహకులు సంతోషం వ్యక్తం చేశారు.ఈ సందర్భంగా నిర్వాహకులు మాట్లాడుతూ గత 9 ఏళ్లుగా దుబాయ్ ప్రభుత్వ సహాయ సహకారాలతో ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహిస్తున్నామని, మునుపటి కంటే ఈ ఏడాది నిర్వహించిన కార్యక్రమానికి ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ రావడం చాలా ఆనందంగా ఉందని తెలిపారు.

కాంగ్రెస్ పార్టీకి చెందిన రాజ్యసభ సభ్యులు ఇమ్రాన్ ప్రతాప్గారి దుబాయ్ లో ఒక ఈవెంట్ లో పాల్గొనడానికి విచ్చేసారు.ఈ సందర్భంగా షేక్ అబ్దుల్లా,ఫహీమ్,ఖాజా,షహరాన్ ఆయన్ను మర్యాదపూర్వకంగా కలిసి ఆయన్ను సన్మానించారు.
తాజా వార్తలు
- తొలి వన్డేలో న్యూజిలాండ్ పై భారత్ విజయం
- NEET UG సిలబస్ విడుదల
- తప్పు ఒప్పుకొన్న X..అశ్లీల పోస్టుల తొలగింపు
- అత్యంత ఘనంగా జరిగిన సూపర్ స్టార్ కృష్ణ కాంస్య విగ్రహావిష్కరణ
- మేడారం జాతరలో 30 మెడికల్ క్యాంపులు ఏర్పాటు: మంత్రి రాజనర్సింహ
- APSPDCL కు జాతీయ అవార్డులు
- నా యూట్యూబ్ వీడియోల్లో ప్రతి లైన్ ఫ్యాక్ట్ చెక్ చేసినదే: ధృవ్ రాఠీ
- సోమాలియా సార్వభౌమాధికారానికి OIC మద్దతు..!!
- షార్జాలో తప్పిపోయిన డాగ్..నెల రొజుల తర్వాత దొరికింది..!!
- స్వర్ణభారత్ ట్రస్ట్ ముచ్చింతల్లో సంక్రాంతి సంబరాలు







