స‌రిహ‌ద్దుల‌లో వాయిసేన‌ 'ఎక్సర్ సైజ్ ఆక్రమణ్'

- April 25, 2025 , by Maagulf
స‌రిహ‌ద్దుల‌లో వాయిసేన‌ \'ఎక్సర్ సైజ్ ఆక్రమణ్\'

శ్రీన‌గ‌ర్: హహల్గాం ఉగ్రదాడిలో 26 మంది టూరిస్టులు ప్రాణాలు కోల్పోవడంతో భారత్ తక్షణ చర్యలకు దిగింది. జమ్మూకశ్మీర్‌లో ఉగ్రవాదుల ఏరివేతను భద్రతా బలగాలు ముమ్మరం చేయడంతో పాటు భారత వాయిసేన కీలకమైన ‘ఎక్సర్ సైజ్ ఆక్రమణ్స‌ పట్టింది. సెంట్రల్ సెక్టార్‌ వ్యాప్తంగా ఆపరేషన్ ఆక్రమణ్ పేరిట భారీ స్థాయిలో సైనిక విన్యాసాలు నిర్వహిస్తోంది. రాఫెల్ జెట్ల సారథ్యంలో ఐఏఎఎఫ్ తన యుద్ధ విమానాల సామర్థ్యాన్ని ప్రదర్శిస్తోంది. హర్యానాలోని అంబాలా, పశ్చిమబెంగాల్ లోని హషిమారాలో రెండు రాఫెల్ స్క్వాడ్రన్లను ఐఏఎఫ్ నిర్వహిస్తోంది.

రాఫెల్ యుద్ధ విమానాలతో పాటు, రవాణా ఎయిర్‌క్రాఫ్ట్‌లు సైతం సైనిక విన్యాసాల్లో పాల్గొంటున్నాయి. సరిహద్దు ప్రాంతాలకు అతి సమీపంలో యుద్ధ విమానాలు తమ సామర్థ్యాన్ని ప్రదర్శిస్తున్నాయి. శత్రువుల కదలికలపై నిఘా సామర్థ్యాన్ని కట్టుదిట్టం చేస్తున్నారు. ఇదే సమయంలో, పాకిస్థాన్ వైమానిక దళ జెట్‌లు కూడా సరిహద్దుల వెంబడి తిరుగుతూ కనిపిస్తున్నాయి.

త్రివిధ దళాలు అప్రమత్తం

ఇండియన్ ఆర్మ్‌డ్ ఫోర్స్‌కు చెందిన ఆర్మీ, నేవీ, ఎయిర్‌ ఫోర్స్ బలగాలు పహల్గాం దాడి తర్వాత్ హైఅలర్ట్ ప్రకటించాయి.జమ్మూకశ్మీర్ నుంచి అరేబియన్ సముద్ర వరకూ త్రివిధ దళాలను అప్రమత్తం చేశారు.పాకిస్థాన్ సరిహద్దు వెంబడి రాఫెల్ జెట్లు ఏరియల్ పెట్రోలింగ్ జరుపుతుండగా, భద్రతా బలగాలు సరిహద్దు గ్రామాల్లో టెర్రరిస్టు శిబిరాలను ధ్వంసం చేస్తూ, తనిఖీలను ముమ్మరం చేస్తున్నాయి.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com