10,000 మంది ఆటా వేడుకలకు హాజరయ్యారు.
- July 08, 2016
ఈ నెల 1వ తేదీ నుంచి 3వ తేదీ వరకు కొనసాగిన ఆటా(అమెరికన్ తెలుగు అసోసియేషన్) సభలు అట్టహాసంగా జరిగాయి. రికార్డు స్థాయిలో దాదాపు 10,000 మంది ఆటా వేడుకలకు హాజరయ్యారని నిర్వహకులు ఓ ప్రకటనలో తెలిపారు. సంప్రదాయబద్దమైన తెలుగు కళలు, నృత్యాలు, ఆటపాటలతో కార్యక్రమం విజయవంతమైందని వివరించారు.మొదటిరోజు జులై 1న ఇల్లినాయిస్ గవర్నర్ బ్రూస్ రానర్ కార్యక్రమాన్ని ఆరంభించారని వెల్లడించారు. చివరి రోజైన జులై 3న కేంద్రమంత్రి వెంకయ్యనాయుడి చేతుల మీద కార్యక్రమాలను ప్రారంభించినట్లు తెలిపారు. ఈ సందర్భంగా వెంకయ్యనాయుడు మాట్లాడుతూ.. ఏ ప్రాంతంలో జీవిస్తున్నా.. తెలుగు సంప్రదాయాలను పాటిస్తూ.. పిల్లలకు తెలుగు భాష నేర్పించడం గొప్ప విషయమని అన్నారు.
ఉత్తర అమెరికాలో సగానికి పైగా విజయాలు సాధించిన వారందరూ ఇతర దేశాలకు చెందిన వారేనని అన్నారు. వారిలో సగం మంది తెలుగు వారేనని చెప్పారు. కాగా, తెలుగు రాష్ట్రాల నుంచి టీడీపీ, వైఎస్సార్ సీపీ, టీఆర్ఎస్ పార్టీలకు చెందిన ప్రముఖ నాయకులు హాజరయ్యారు.
తాజా వార్తలు
- గుల్మార్గ్లో ఎంపీ బాలశౌరి నేతృత్వంలో కమిటీ సమావేశం
- యూఏఈలో హత్య కేసుల్లో కిసాస్ మినహాయింపు పై కొత్త శిక్షలు..
- అమెజాన్‌లో రికార్డు స్థాయి అమ్మకాలు..
- CJP అధ్యక్షుడు అభిజీత్ దీప్కే అరెస్ట్
- తిరుమలలో మరోసారి బ్రహ్మోత్సవాల సందడి
- ‘RTC’ ఎన్నికల్లో EU కూటమి విజయం!
- లుసైల్ బౌలేవార్డ్పై నేడు ట్రాఫిక్ ఆంక్షలు..!!
- అబుధాబిలో మూడు రోజుల పాటు రహదారి మూసివేత..!!
- కువైట్‌లో రోడ్డుపై వ్యర్థాలు.. ట్రక్ డ్రైవర్ పై బహిష్కరణ వేటు..!!
- పోస్టల్ అభివృద్ధి సూచీలో ఒమన్‌కు అగ్రస్థానం..!!







