సౌదీ ఆయిల్ రిజర్వ్‌లపై గందరగోళం
- July 08, 2016
రిస్తాద్ ఎనర్జీ - నార్వేజియన్కి చెందిన ఆయిల్ గ్యాస్ డేటా సంస్థ వెల్లడించిన విషయాలు ఆందోళన కలిగిస్తున్నాయి. సౌదీ అరేబియా కంటే కూడా అమెరికాలోనే ఎక్కువగా చమురు నిల్వలు ఉన్నాయని, అయితే అందులో 50 శాతం ఆయిల్ రిజర్వ్స్ అన్ కన్వెన్షనల్ షేల్ ఆయిల్ రూపంలో ఉన్నాయని ఆ సంస్థ పేర్కొంది. టెక్సాస్‌లోనే 60 మిలియన్ బ్యారెల్స్ చమురు నిల్వలున్నాయట. అదే సమయంలో సౌదీలో ఆయిల్ నిల్వలు తక్కువగా ఉన్నాయని, ఎక్కువ కాలం రియాద్ ఆయిల్ ఎక్స్‌పోర్ట్స్‌ని కొనసాగించలేదని రిస్తాద్ ఎనర్జీ పేర్కొనడం వివాదాస్పదమయ్యింది. అయితే సౌదీ చమురు నిల్వల విషయంలో ఎలాంటి అనుమానాలూ అవసరం లేదని ఆ దేశం చెబుతోంది. రిస్తాద్ తొలిసారిగా ఈ వివాదాన్ని తెరపైకి తెచ్చిందనుకోవడం పొరపాటు. గతంలో కూడా సౌదీలో పరిస్థితుల్ని అధ్యయనం చేసిన యూఎస్ కంపెనీలు ఈ విషయాల్ని వెల్లడించాయి. ఏళ్ళ తరబడి, డిమాండ్‌ని మించి చమురు వెలికితీత కారణంగా భవిష్యత్తులో సమస్యలు తప్పవని నిపుణులు అంచనా వేస్తున్నారు.
తాజా వార్తలు
- యూఏఈలో ఓపెన్ బావులపై భారీ తనిఖీలు..!!
- 136 హౌతీ సైనిక స్థావరాలు ధ్వంసం..!!
- అరేబియా సముద్రంలోని హంప్‌బ్యాక్ వేల్స్ కు ప్రత్యేక గుర్తింపు..!
- కువైట్ ఫహాహీల్ మార్కెట్లో కుళ్లిన చేపలు ధ్వంసం..!!
- బహ్రెయిన్‌లో మైనర్లకు వేప్ విక్రయిస్తే BD1,000 జరిమానా..!!
- ఖతార్–భారత్ మధ్య ఆరో విడత రాజకీయ సంప్రదింపులు..!!
- గుల్మార్గ్లో ఎంపీ బాలశౌరి నేతృత్వంలో కమిటీ సమావేశం
- యూఏఈలో హత్య కేసుల్లో కిసాస్ మినహాయింపు పై కొత్త శిక్షలు..
- అమెజాన్‌లో రికార్డు స్థాయి అమ్మకాలు..
- CJP అధ్యక్షుడు అభిజీత్ దీప్కే అరెస్ట్







