విశాఖలో తలసేమియా బాధితుల కోసం మే 8న భరోసా కల్పిద్దాం-నారా భువనేశ్వరి
- April 26, 2025
హైదరాబాద్: 25 బెర్తుల కెపాసిటీతో తలసేమియా బాధితుల కోసం 25 పడకలతో తలసేమియా సెంటర్ ప్రారంభించడం చాలా ఆనందంగా వుంది.తలసేమియా బాధితుల కోసం మే 8న విశాఖ ఆర్కే బీచ్ రోడ్డులో 3కె, 5కె, 10కె రన్ నిర్వహిస్తున్నాం.ఇందులో పాల్గొని తలసేమియా బాధితులకు అండగా వుంటామన్న భరోసా కల్పిద్దామని పిలుపునిచ్చారు ఎన్టీఆర్ ట్రస్ట్ మేనేజింగ్ ట్రస్టీ నారా భువనేశ్వరి.ఈ మేరకు విలేకరుల సమావేశంలో మాట్లాడారు.
ప్రెస్ మీట్ లో ఎన్టీఆర్ ట్రస్ట్ మేనేజింగ్ ట్రస్టీ నారా భువనేశ్వరి మాట్లాడుతూ..మా ఆహ్వానాన్ని మన్నించి ఈ ప్రెస్ మీట్ కి విచ్చేసిన మీడియా వారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు.ఎస్ఎస్ తమన్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు. ఫిబ్రవరి 15న విజయవాడలో జరిగిన మ్యూజికల్ నైట్ లో తలసేమియా సెంటర్ ని ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చాము. ఇవాళ 25 బెర్తుల కెపాసిటీతో ఈ వ్యాధి బాధితుల కోసం 25 పడకలతో తలసేమియా సెంటర్ ప్రారంభించడం చాలా ఆనందంగా వుంది. ఈ వ్యాధితో బాధపడుతున్న చిన్నారులకు ప్రతి నెలా రక్త మార్పిడి చేయాలి. అది జరగకపొతే ప్రాణాలకే ముప్పు. అలాగే వారు వాడే మందులు కూడా చాలా ఖర్చు అవుతుంది. మనం చేసే గొప్ప సేవ రక్తదానమే. అందరూ 4 నెలలకు ఒకసారి రక్తదానం చేయాలని కోరుతున్నాను. ట్రస్ట్ ద్వారా విద్య, వైద్య, విపత్తు నిర్వహణ, ఉపాధి కల్పన వంటి కార్యక్రమాలు చేస్తున్నాం. తలసేమియా బాధితుల కోసం మే 8న విశాఖ ఆర్కే బీచ్ రోడ్డులో 3కె, 5కె, 10కె రన్ నిర్వహిస్తున్నాం.ఇందులో పాల్గొని తలసేమియా బాధితులకు అండగా వుంటామన్న భరోసా కల్పిద్దాం. ఒక్క పరుగు వంద జీవితాల్లో వెలుగునిస్తుంది. నేను వాళ్ళ కోసం ఎన్నో కిలో మీటర్లు పరిగెత్తడానికి రెడీ. మీరందరూ కూడా రెడీ అయి ఈ రన్ లో పాల్గొనమని కోరుతున్నాను. అందరికీ కృతజ్ఞతలు'అన్నారు.
మ్యూజిక్ డైరెక్టర్ తమన్ మాట్లాడుతూ..అందరికీ నమస్కారం. మేడమ్ భువనేశ్వరి డెడికేషన్ తో మ్యూజికల్ ఈవెంట్ గ్రాండ్ సక్సెస్ అయింది.చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్, బాలకృష్ణ, లోకేష్ ముందు పెర్ఫామ్ చేయడం మెమరబుల్ ఎక్స్పీరియన్స్. తలసేమియా సెంటర్ ని ప్రారంభించడం నాకు చాలా గొప్ప ఆనందాన్ని ఇచ్చింది. చాలా హై ఇచ్చింది.నన్ను బలంగా నమ్మిన మేడం గారికి థాంక్యూ. నేనెప్పుడూ ఈ గొప్ప కార్యక్రమానికి సపోర్ట్ గా ఉంటాను. ఒక లయన్ లేడీగా ఇన్ని అద్భుతమైన కార్యక్రమాలు ఆవిడ చేయడం నాకెంతో స్ఫూర్తినిస్తుంది. నేను ఎప్పటికీ మేడమ్ కి సపోర్ట్ గా ఉంటాను.ఈ కార్యక్రమం గ్రేట్ సక్సెస్ కావాలని కోరుకుంటున్నాను.నా జీవితంలో ఎప్పుడు కూడా ఇంత ఆనందం రాలేదు.మే 8న విశాఖ ఆర్కే బీచ్ రోడ్డులో 3కె, 5కె, 10కె రన్ లో అందరూ పాల్గొని తలసేమియా బాధితులకు సపోర్టుగా నిలవాలని కోరుకుంటున్నాను.నా జీవితాంతం కలిసేమియా బాధితులకు అండగా ఉంటాను'అన్నారు.
తాజా వార్తలు
- నకిలీ మద్యం కేసు..ప్రభుత్వం కీలక నిర్ణయం..సిట్ ఏర్పాటు..
- హైదరాబాద్: భారతదేశపు తొలి సెమీకండక్టర్ ఇన్నోవేషన్ మ్యూజియం ప్రారంభం
- హైదరాబాద్ సీపీ సజ్జనార్‌ను కలిసి శుభాకాంక్షలు తెలిపిన చిరంజీవి
- కువైట్ లో వాటర్ కొరత..కీలక సూచనలు..!!
- సౌదీలో అక్రమ డ్రైవర్ల పై ఉక్కుపాదం..!!
- సెప్టెంబర్‌లో ఖతార్ కు పోటెత్తిన ప్యాసింజర్స్..!!
- స్వీట్లు తినిపించి పిల్లల గొంతుకోసి చంపిన తండ్రి
- షార్జాలో జైవాకర్ల పై కఠిన చర్యలు..!!
- యూరప్‌కు వెళుతున్నారా? అమల్లోకి వచ్చిన న్యూ రూల్స్..!!
- BHD 52,000 VAT ఎగవేతపై దర్యాప్తు పూర్తి..!!