ప్రవాసాంధ్రుల అభ్యున్నతే ఏపీ ఎన్నార్టీ ధ్యేయం: మంత్రి శ్రీనివాస్
- April 29, 2025
అమరావతి: ఆంధ్రప్రదేశ్ నాన్ రెసిడెంట్ తెలుగు సొసైటీ 14.. ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ మీటింగ్, అధ్యక్షులు మంత్రి కొండపల్లి శ్రీనివాస్ ఆధ్వర్యంలో తాడేపల్లిలోని, ఏపీ ఎన్నార్టీ కార్యాలయంలో జరిగింది.ప్రధానంగా పరిపాలనా పరమైన అంశాలు, పద్దుల నిర్వహణ, ట్రస్ట్ వ్యవహారాలు, విధానపరమైన నిర్ణయాలు, గత రెండేళ్ళుగా ఎన్నార్టీ చేపట్టినటువంటి కార్యక్రమాలు, భవిష్యత్తు కార్యాచరణ తదితర అంశాలపై చర్చ జరిగింది.అమరావతిలో నిర్మించ తలపెట్టిన ఐకానిక్ ప్రాజెక్ట్, పురోగతిపై సమీక్షించారు.ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు ఆలోచనకు అనుగుణంగా భవిష్యత్తు కార్యాచరణ ఉండాలని, ప్రధానంగా ఎన్నారైల అభ్యున్నతి కొరకు కృషి చేయాలని నిర్ణయించారు. ఏపీ ఎన్నార్టీ సభ్యత్వాన్ని ముందుకు తీసుకువెళ్లేందుకు ప్రవాసాంధ్రులలో చైతన్యం తీసుకురావాలని, ఎన్నార్టీని విదేశాల్లో ఉన్న ప్రతీ తెలుగు పౌరుడికి చేరువ చేయాలని, సంస్థ నిస్పక్షపక్షపాతంగా సేవలు అందించే దిశగా ఓ ప్రణాళిక ప్రకారం ముందుకు వెళ్లాలని నిర్ణయించారు.గల్ఫ్ దేశాల్లో ఇబ్బందులు ఎదుర్కొంటున్న తెలుగు వారికి అండగా నిలబడటమే కాకుండా రాష్ట్రంలో ఉన్న వారి కుటుంబాలకు సైతం ధైర్యం కల్పించే దిశగా సంస్థ ముందుకు వెళ్లాలని మంత్రి సూచించారు. ఈ సమావేశంలో ఏపీ ఎన్నార్టీ సిఈఓ హేమలత, ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ మెంబర్లు వేమూరి రవి కుమార్, ఇతర కార్యవర్గ సభ్యులు, తదితరులు పాల్గొన్నారు.
తాజా వార్తలు
- ఆర్చరీ ప్రీమియర్ లీగ్ విజయం తర్వాత ప్రధాని మోదీని కలిసిన రామ్ చరణ్
- ఘనంగా ఫిలింఫేర్ అవార్డుల ప్రదానోత్సవం..
- పాపికొండల విహారయాత్ర రీస్టార్ట్
- తెలంగాణకు ఐకానిక్ గా టీస్క్వేర్ నిర్మాణం: సీఎం రేవంత్
- 2026 ఫిబ్రవరి నాటికి స్వదేశీ AI
- విజయవాడ-సింగపూర్ మధ్య విమాన సర్వీసులు
- కొత్త యాప్ తో కల్తీ మద్యం గుట్టు రట్టు
- BHD 85.4 మిలియన్ల డీల్ కు అంగీకరించిన బహ్రెయిన్, కువైట్..!!
- జహ్రాలో ప్రభుత్వ ఉద్యోగి అరెస్టు..డ్రగ్స్, గన్ స్వాధీనం..!!
- అమెరికా వార్ సెక్రెటరీతో ఖతార్ డిప్యూటి పీఎం సమావేశం..!!