సైన్యానికి ఫుల్ పవర్స్ ఇచ్చిన ప్రధాని మోదీ
- April 29, 2025
న్యూ ఢిల్లీ: ఉగ్రవాదం పై పోరులో సైన్యానికి పూర్తి స్వేచ్చ, ఫుల్ పవర్స్ ఇస్తున్నట్లు ప్రధాని మోదీ సంచలన ప్రకటన చేశారు. త్రివిధ దళాధిపతుల సమావేశంలో మోదీ ఈ కీలక ప్రకటన చేశారు. పహల్గాం ఉగ్రదాడికి ధీటైన జవాబు ఇస్తామన్నారు. ఉగ్రవాదాన్ని అంతం చేస్తామని ఆయన తేల్చి చెప్పారు. భారత సైన్యంపై తమకు పూర్తి నమ్మకం ఉందన్నారు ప్రధాని మోదీ. యాక్షన్ ప్లాన్ లో ఆర్మీకి పూర్తి స్వేచ్ఛ ఇస్తున్నామన్నారు. ఎలాంటి జవాబు ఇవ్వాలో, టైమ్, ప్లేస్ కూడా భారత సైన్యమే డిసైడ్ చేస్తుందన్నారు ప్రధాని మోదీ. ఉగ్రవాదాన్ని అంతమొందించడమే లక్ష్యం అన్నారు ప్రధాని మోదీ.
మంగళవారం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఉన్నత స్థాయి భద్రతా సమావేశానికి అధ్యక్షత వహించారు. జమ్మూ కాశ్మీర్‌లోని పహల్గాంలో ఇటీవల జరిగిన ఉగ్రదాడికి భారతదేశం ప్రతిస్పందన, సమయం, లక్ష్యాన్ని నిర్ణయించడానికి భారత సాయుధ దళాలకు పూర్తి కార్యాచరణ స్వేచ్ఛ ఉందని ఆయన తెలియజేశారు.
ఏప్రిల్ 22న పహల్గాంలో ఉగ్రవాదులు మారణహోమం సృష్టించారు. పర్యాటకులు లక్ష్యంగా కాల్పులు జరిపారు. ఉగ్రదాడిలో 26 మంది చనిపోయారు. ఈ దాడికి పాకిస్తాన్ మద్దతు ఉన్న ఉగ్రవాద నెట్‌వర్క్‌లే కారణమని భారత్ చెబుతోంది. ఉగ్రదాడి నేపథ్యంలో ఏ విధంగా ముందుకెళ్లాలి అనేదానిపై త్రివిధ దళాధిపతులతో ప్రధాని మోదీ కీలక సమావేశం నిర్వహించారు.
తాజా వార్తలు
- ఆర్చరీ ప్రీమియర్ లీగ్ విజయం తర్వాత ప్రధాని మోదీని కలిసిన రామ్ చరణ్
- ఘనంగా ఫిలింఫేర్ అవార్డుల ప్రదానోత్సవం..
- పాపికొండల విహారయాత్ర రీస్టార్ట్
- తెలంగాణకు ఐకానిక్ గా టీస్క్వేర్ నిర్మాణం: సీఎం రేవంత్
- 2026 ఫిబ్రవరి నాటికి స్వదేశీ AI
- విజయవాడ-సింగపూర్ మధ్య విమాన సర్వీసులు
- కొత్త యాప్ తో కల్తీ మద్యం గుట్టు రట్టు
- BHD 85.4 మిలియన్ల డీల్ కు అంగీకరించిన బహ్రెయిన్, కువైట్..!!
- జహ్రాలో ప్రభుత్వ ఉద్యోగి అరెస్టు..డ్రగ్స్, గన్ స్వాధీనం..!!
- అమెరికా వార్ సెక్రెటరీతో ఖతార్ డిప్యూటి పీఎం సమావేశం..!!