ఖతార్ లో మొట్టమొదటి ప్రీ-ఓన్డ్ బోట్ షో..!!

- May 01, 2025 , by Maagulf
ఖతార్ లో మొట్టమొదటి ప్రీ-ఓన్డ్ బోట్ షో..!!

దోహా, ఖతార్: ఓల్డ్ దోహా పోర్ట్ ఖతార్ మొట్టమొదటి మినా ప్రీ-ఓన్డ్ బోట్ షోకు సిద్ధమైంది. మే 5 నుండి 7 వరకు జరిగే ఈ ప్రదర్శన.. మొదటిసారిగా సముద్ర ఔత్సాహికులు, కొనుగోలుదారులు-అనుభవజ్ఞులైన బోటర్లను ఒకచోట చేర్చనుంది. జెట్ స్కీలు, ఫిషింగ్ బోట్ల నుండి యాచ్‌లు, సూపర్‌యాచ్‌లు , సాంప్రదాయ ధోవ్‌ల వరకు ప్రీ-ఓన్డ్ వాటర్‌క్రాఫ్ట్‌ల  క్యూరేటెడ్ ఎంపికలను అందించనుంది.

ఖతార్ సముద్ర కమ్యూనిటీకి మద్దతు ఇవ్వడానికి ఓల్డ్ దోహా పోర్ట్ పడవ యజమానులకు వారి నౌకలను ఉచితంగా ప్రదర్శించే అవకాశాన్ని అందిస్తోంది. సందర్శకులందరికీ ఉచిత  ప్రవేశం కల్పిస్తున్నారు.

ఆన్-సైట్ నిర్వహణ వర్క్‌షాప్‌లు, తనిఖీ సేవలు కూడా అందుబాటులో ఉంటాయి.  తమ ప్రీ-ఓన్డ్ ఓడలను ప్రదర్శించడానికి ఆసక్తి ఉన్న పడవ యజమానులు, మెరైన్ కంపెనీలు +974 5567 7614 కు కాల్ చేయడం ద్వారా నమోదు చేసుకోవాలని ఓల్డ్ దోహా పోర్ట్ సీఈఓ ఇంజనీర్ మొహమ్మద్ అబ్దుల్లా అల్ ముల్లా సూచించారు. మినా ప్రీ-ఓన్డ్ బోట్ షో ప్రతిరోజూ సాయంత్రం 5 గంటల నుండి రాత్రి 9 గంటల వరకు జరుగుతుందని తెలిపారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com