విజయవాడలో ప్రధాని మోదీ ఘన స్వాగతం

- May 02, 2025 , by Maagulf
విజయవాడలో ప్రధాని మోదీ ఘన స్వాగతం

విజయవాడ: ఆంధ్రప్రదేశ్ రాజధాని అమారావతి పనుల పునఃప్రారంభోత్సవానికి ప్రధాని నరేంద్ర మోదీ విచ్చేశారు. రాజధాని నిర్మాణానికి మళ్లీ శుభారంభం ఏర్పడింది. ఈ సందర్భంగా భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ స్వయంగా హాజరై శంకుస్థాపనలు చేయడం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ప్రధాని నరేంద్ర మోదీ ముందుగా కేరళలోని తిరువనంతపురంలో జరిగిన అధికారిక కార్యక్రమాన్ని ముగించుకొని, అక్కడి నుంచి నేరుగా విజయవాడ గన్నవరం విమానాశ్రయానికి ప్రత్యేక విమానంలో చేరుకున్నారు. అక్కడ రాష్ట్ర అసెంబ్లీ స్పీకర్, డిప్యూటీ స్పీకర్, పలువురు మంత్రులు ఆయనకు ఘన స్వాగతం పలికారు. అనంతరం ఆయన ఇండియన్ ఎయిర్ ఫోర్స్ హెలికాప్టర్ లో రాజధాని ప్రాంతంలోని వెలగపూడికి చేరుకున్నారు. ప్రధానికి గవర్నర్ అబ్దుల్ నజీర్, ముఖ్యమంత్రి చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాన్ ఘన స్వాగతం పలికారు. ప్రధానిని వీరు సభాస్థలికి తీసుకెళ్లారు. 

వెలగపూడిలో ప్రధాని పర్యటన

సాంప్రదాయ బద్ధంగా పూర్ణకుంభంతో, వేద మంత్రోచ్ఛారణలతో మహా గౌరవంతో ప్రధాని ని ఆహ్వానించారు. కాసేట్లో ప్రధాని రాజధాని అమరావతి పనులతో పాటు, 18 ప్రాజెక్ట్ లకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేయనున్నారు. సభాస్థలి ఇప్పటికే లక్షలాది మందితో కిటకిటలాడుతోంది. సభకు పెద్ద సంఖ్యలో అమరావతి రైతులు హాజరయ్యారు. తమ కల సాకారమవుతోందని వారంతా ఎంతో సంతోషంగా ఉన్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com