దుబాయ్‌ను అర్బన్, రూరల్ జోన్లుగా విభజన..!!

- May 04, 2025 , by Maagulf
దుబాయ్‌ను అర్బన్, రూరల్ జోన్లుగా విభజన..!!

దుబాయ్: సెక్యూరిటీ, రెస్పాన్స్ టైమ్ ను మెరుగుపరచడం లక్ష్యంగా ఎమిరేట్‌ను "పట్టణ",  "గ్రామీణ" మండలాలుగా విభజించనున్నట్లు దుబాయ్ పోలీసులు ప్రకటించారు. అథారిటీ అధికారిక X ఖాతా, వారి వెబ్‌సైట్ ద్వారా ఈ మేరకు ప్రకటించారు.  ఈ వ్యూహాత్మక విభాగం గస్తీ, సిబ్బందితో సహా వనరుల కేటాయింపును ఆప్టిమైజ్ చేస్తుందని, ప్రతి జోన్‌లో అత్యాధునిక స్మార్ట్ టెక్నాలజీలు, కృత్రిమ మేధస్సును కలుపుతుందని తెలిపారు.  

ఈ విభజన భద్రత, ట్రాఫిక్ నిర్వహణ, ఇతర కీలకమైన సేవలలో ప్రత్యేక సిబ్బందిని మరింత సమర్థవంతంగా సమన్వయం చేస్తుందని దుబాయ్ పోలీసులలో క్రిమినల్ ఇన్వెస్టిగేషన్ వ్యవహారాల అసిస్టెంట్ కమాండర్-ఇన్-చీఫ్ మేజర్ జనరల్ ఖలీల్ ఇబ్రహీం అల్ మన్సౌరి తెలిపారు. ఇది దుబాయ్ పోలీసు కార్యకలాపాల మొత్తం సామర్థ్యాన్ని పెంచుతుందని పేర్కొన్నారు. ముఖ్యంగా అత్యవసర పరిస్థితుల్లో వేగవంతమైన ప్రతిస్పందనకు, మొత్తం ఎమిరేట్ అంతటా భద్రతా కవరేజీని మెరుగుపరుస్తుందని ఆయన అన్నారు.  జోన్ల విభజన ప్రపంచంలోని అత్యంత సురక్షితమైన నగరాల్లో ఒకటిగా దుబాయ్ స్థానాన్ని మరింత సుస్థిరం చేస్తుందని భావిస్తున్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com