కువైట్ లో అఫర్డబుల్ ఫిష్ ఇనిషియేటివ్ స్కీమ్..!!
- May 05, 2025
కువైట్: సీఫుడ్ ధరలను తగ్గించడానికి, మార్కెట్ స్థిరత్వాన్ని పెంచడానికి, కువైట్ మత్స్యకారుల సంఘం చేపలను దిగుమతి చేసుకుని, ధరకు విక్రయించడానికి ఒక కొత్త వ్యూహాన్ని ప్రకటించింది. ఇది వినియోగదారులందరికీ సరసమైన ధరకు సీ ఫుడ్ ను అందిస్తుందని చెబుతున్నారు. పబ్లిక్ అథారిటీ ఫర్ అగ్రికల్చర్ అఫైర్స్ అండ్ ఫిష్ రిసోర్సెస్ (PAAAFR) సహకారంతో.. లైసెన్స్ పొందిన మత్స్యకారులకు మద్దతు ఇస్తూ స్థానిక, దిగుమతి చేసుకున్న చేపల రెండింటినీ సరఫరా చేయడమే ఈ చొరవ లక్ష్యమని యూనియన్ అధిపతి అబ్దుల్లా అల్-సర్హీద్ తెలిపారు. కాగా, ఈ ప్రతిపాదనకు వ్యవసాయ మంత్రిత్వ శాఖ అధికారులు మద్దతు వ్యక్తం తెలిపారు. ప్రతిపాదనలను సమీక్షించి సముద్ర ఆహార భద్రతను బలోపేతం చేస్తామని వారు హామీ ఇచ్చారు.
తాజా వార్తలు
- దుబాయ్ లో అక్టోబర్ 12న FOI ఈవెంట్స్ దీపావళి ఉత్సవ్
- ఏపీ: నకిలీ మద్యం కేసు..రహస్య ప్రదేశంలో కింగ్ పిన్ విచారణ..
- ఐపీఎల్ మినీ వేలానికి ముహూర్తం ఫిక్స్
- భారత్‌లో 9 బ్రిటన్ యూనివర్శిటీల క్యాంపస్
- ఐటీ హబ్‌గా ఆంధ్ర ప్రదేశ్..
- మైక్రోసాఫ్ట్ సలహాదారుగా రిషి సునాక్
- ఆరుగురు కొత్త కంటెస్టెంట్లు ఎంట్రీ
- ఖతార్ ఆకాశంలో కనువిందు చేసిన అద్భుతం..!!
- మసీదులు, స్కూళ్ల వద్ద పొగాకు షాప్స్ పై నిషేధం..!!
- Dh430,000 గెలుచుకున్న భారత్, బంగ్లా ప్రవాసులు..!!