ఖతార్ ఆకాశంలో కనువిందు చేసిన అద్భుతం..!!
- October 10, 2025
దోహా: దాదాపు 250 నక్షత్రాలను కలిగి ఉన్న ప్లీయేడ్స్ స్టార్ క్లస్టర్, ఖతార్ ఆకాశంలో కనువిందు చేసింది. గురువారం రాత్రి 7:30 నుండి సూర్యోదయం వరకు ఇది ఆకాశంలో చంద్రుడికి దగ్గరగా కనిపించింది.
ఖతార్ క్యాలెండర్ హౌస్ (QCH) ప్రకారం, ఈ ఖగోళ అద్భుతం నేరుగా కంటితో కూడా కనిపిస్తుంది. ముఖ్యంగా తూర్పు హోరిజోన్ వైపు చూస్తే దీనిని చూడవచ్చని పర్యావరణ వేత్తలు తెలిపారు. చీకటి ప్రాంతాల నుండి అయితే మరింత అద్భుతంగా కనిపిస్తుందన్నారు.
ప్లీయేడ్స్ రాత్రి ఆకాశంలో ప్రకాశవంతమైన మరియు అత్యంత ప్రసిద్ధ స్టార్ క్లస్టర్ లలో ఒకటి. టెలిస్కోప్ అవసరం లేకుండానే చంద్రుడు మరియు ప్లీయేడ్స్ అందమైన జతను చూసి ఆస్వాదించవచ్చని వెల్లడించారు.
తాజా వార్తలు
- జయశంకర్ విశ్వనాథన్‌కు చెంబై సంగీత సంరక్షక పురస్కారం ప్రదానం..!!
- జనవరి 20నుంచి ఉచిత, రాయితీ స్కూల్ సీట్ల రిజిస్ట్రేషన్ ప్రారంభం..!!
- రియాద్ మెట్రో.. రెడ్ లైన్‌ను దిరియా వరకు పొడిగింపు..!!
- హీరా గ్రూప్ దర్యాప్తులో జోక్యం.. భారత్ లో వ్యక్తి అరెస్టు..!!
- కువైట్ వెదర్ అలెర్ట్..డస్టీ విండ్స్, మోస్తరు వర్షాలు..!!
- ఒమన్ లో సెంట్రల్ పబ్లిక్ హెల్త్ లాబొరేటరీ ప్రారంభం..!!
- వందేభారత్ స్లీపర్.. మినిమమ్ ఛార్జీ రూ.960
- దేశ చరిత్రలో తొలిసారి ఆదివారం బడ్జెట్ ను ప్రవేశ పెడుతున్నారు !!
- సంక్రాంతికి కొత్త ఆఫీసులోకి ప్రధాని..
- గల్ఫ్ కార్మికుల మానవత్వం







