మసీదులు, స్కూళ్ల వద్ద పొగాకు షాప్స్ పై నిషేధం..!!
- October 10, 2025
రియాద్: మసీదులు మరియు పాఠశాలలకు 500 మీటర్ల దూరంలో పొగాకు దుకాణాలను నడపడంపై సౌదీ అరేబియా నిషేధం విధించింది. ఈ విషయంలో మునిసిపాలిటీలు, గృహనిర్మాణ మంత్రిత్వ శాఖ లు చేపట్టిన నియంత్రణ చర్యలను ఆమోదించింది. ప్రజారోగ్యాన్ని ప్రోత్సహించడం, సౌదీ అంతటా సురక్షితమైన వాణిజ్య వాతావరణాన్ని సృష్టించడమే లక్ష్యంగా పొగాకు వినియోగంపై నిషేధం విధించినట్లు వెల్లడించారు.
అన్ని సిగరెట్లు, షిషా మరియు ఇ-సిగరెట్లు సహా పొగాకు ఉత్పత్తులు మరియు ఉపకరణాలను విక్రయించే అన్ని దుకాణాలకు కొత్త నిబంధన వర్తిస్తుందని మంత్రిత్వ శాఖ స్పష్టం చేసింది. అలాగే, 18 సంవత్సరాల కంటే తక్కువ వయస్సు ఉన్న ఎవరికైనా పొగాకు ఉత్పత్తులను విక్రయిస్తే.. కేసులు నమోదు చేసి భారీ జరిమానాలతోపాటు జైలు శిక్ష కూడా విధిస్తామని హెచ్చరించింది.
సౌదీ ఫుడ్ అండ్ డ్రగ్ అథారిటీ ఆమోదించిన ప్రామాణిక స్పెసిఫికేషన్లకు అనుగుణంగా లేని సింగిల్ సిగరెట్లు లేదా ఉత్పత్తుల అమ్మకాన్ని నిషేధించినట్లు పేర్కొన్నారు. ఇ-సిగరెట్ ద్రవాలను పొగాకుతో ఫిల్ చేయడాన్ని కూడా నిషేధించారు.
తాజా వార్తలు
- TPCC డాక్టర్స్ సెల్ వైస్ చైర్మన్ గా డాక్టర్ కరిష్ని చిత్తర్వు నియామకం..!!
- ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కులను పంపిణి చేసిన ఎంపి బాలశౌరి
- ఏపీ: కోస్తా, రాయలసీమలో భారీ వర్షాలు
- హైదరాబాద్లో గ్లోబల్ ఇన్నోవేషన్ సమ్మిట్ 2026
- 2026 సెలవుల క్యాలెండర్ విడుదల చేసిన కేంద్ర ప్రభుత్వం
- శ్రీరాముడి విగ్రహాన్ని ఆవిష్కరించిన ప్రధాని మోదీ
- మంత్రి శ్రీధర్ బాబును మర్యాదపూర్వకంగా కలిసిన సందీప్ మక్తాలా
- NABARD రిక్రూట్మెంట్ అలర్ట్–అర్హతలు, తేదీల పూర్తి వివరాలు…
- రష్యా అధ్యక్షుడు పుతిన్ డిసెంబర్ 4న భారత పర్యటన..
- షార్క్ లో NBK క్షేత్ర పర్యటన..!!







