జమ్ముకశ్మీర్‌లో పలు ప్రాంతాల్లో ఘర్షణలు
- July 09, 2016
పలు ప్రాంతాల్లో ఘర్షణలు కుల్గాంలో భాజపా కార్యాలయంపై దాడి బుర్హాన్ అంత్యక్రియలకు వందల మంది హాజరు శ్రీనగర్: హిజ్బుల్ ముజాహిదీన్ కీలక ఉగ్రవాది బుర్హాన్ వనీ ఎన్‌కౌంటర్‌లో హతమైన నేపథ్యంలో జమ్ముకశ్మీర్‌లో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. కశ్మీర్‌లోని పలు ప్రాంతాల్లో యువకులు పోలీసు పోస్ట్‌లు, సెక్యురిటీ సిబ్బందిపై దాడులకు దిగారు. దీంతో ఘర్షణ వాతావరణం నెలకొంది. దాడుల్లో ముగ్గురు పోలీసులు సహా 11 మంది గాయపడ్డారు. కుల్గాంలోని భాజపా కార్యాలయంపైనా ఆందోళనకారులు దాడులు చేశారు. బందిపొరా, ఖాజిగండ్, లార్నో, అనంతనాగ్ తదితర ప్రాంతాల్లో పోలీసు చెక్‌పోస్ట్‌లపై ఆందోళనకారులు రాళ్లు రువ్వారు. కుల్గాం జిల్లాలో పలు చోట్ల ఆందోళనలు హింసాత్మకంగా మారాయి. పోలీసులు, భద్రత సిబ్బంది పరిస్థితి అదుపు చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. రాష్ట్రంలో ఉద్రిక్త పరిస్థితి నేపథ్యంలో ఇప్పటికే శ్రీనగర్ సహా పలు ప్రాంతాల్లో కర్ఫ్యూ విధించారు. మొబైల్ ఇంటర్నెట్‌సేవలను నిలిపేశారు. అమర్‌నాథ్ యాత్రను కూడా తాత్కాలికంగా ఆపేశారు.
శుక్రవారం రాత్రి అనంతనాగ్‌లోని కొకేర్‌నాగ్ ప్రాంతంలో జరిగిన ఎదురుకాల్పుల్లో బుర్హాన్‌తో పాటు మరో ఇద్దరు ఉగ్రవాదులను సైన్యం మట్టుబెట్టింది. సామాజిక మాధ్యమాల ద్వారా యువతను ఉగ్రవాదంవైపు ఆకర్షిస్తున్న బుర్హాన్‌ను మట్టుబెట్టడం సైన్యం భారీ విజయంగా భావిస్తోంది. అయితే రాష్ట్రంలో బుర్హాన్ మృతిపట్ల తీవ్ర ఆందోళనలు జరుగుతున్నాయి. త్రాల్ నగరంలోని ఈద్గా వద్ద జరిగిన బుర్హాన్ అంత్యక్రియలకు పెద్ద సంఖ్యలో ప్రజలు వచ్చారు. కొందరు వేర్పాటు వాద నేతలు త్రాల్ వచ్చేందుకు ప్రయత్నించగా భద్రత సిబ్బంది అడ్డుకున్నారు.
తాజా వార్తలు
- కువైట్‌లో భారీ డ్రగ్స్ వ్యతిరేక ఆపరేషన్.. ఎనిమిది మంది అరెస్ట్..!!
- ఆగస్టు నుంచి పీహెచ్‌సీసీ 'కేర్ సమ్మర్' కార్యక్రమం..!!
- ఇంధన రంగంలో సహకారంపై సౌదీ–భారత్ చర్చలు..!!
- సోషల్ మీడియాలో అభ్యంతరకర పోస్టులు.. వ్యక్తి అరెస్ట్..!!
- ఒమన్‌లో జూలై 25 నుంచి 'పర్పుల్ శనివారం' ప్రారంభం..!!
- దుబాయ్‌లో 30 ఫుట్ ఓవర్ బ్రిడ్జీలపై స్మార్ట్ LED వ్యవస్థ..!!
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్‌సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్‌పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..







