జులై 9 నుంచి దుబాయ్ సమ్మర్ సర్‌ప్రైజెస్
- July 09, 2016
దుబాయ్ సమ్మర్ సర్‌ప్రైజెస్ (డిఎస్‌ఎస్) 19వ ఎడిషన్ మరోసారి అందర్నీ అలరించేందుకు సిద్ధమయ్యింది. 43 రోజులపాటు సాగే ఈ ఎడిషన్‌లో షాపింగ్, వరల్డ్ క్లాస్ ఎంటర్‌టైన్‌మెంట్, రివార్డింగ్ ఎక్స్‌పీరియన్సెస్ ప్రధాన ఆకర్షణలు కానున్నాయి. జులై 9 నుంచి ఆగస్ట్ 20 వరకు ఈ ఫెస్టివల్ జరగనుంది. రీజియన్‌లో లార్జెస్ట్ మరియు లాంగెస్ట్ సమ్మర్ వేడుకగా దీన్ని అభివర్ణించవచ్చు. 'ఓన్ ది సమ్మర్' థీమ్‌తో ఈ ఏడాది సరికొత్తగా నిర్వాహకులు ఈ ఎడిషన్‌ని ప్లాన్ చేశారు. దుబాయ్ ప్రపంచంలో అందరికీ డ్రీమ్ డెస్టినేషన్. ఈ తరహా ఫెస్టివల్స్‌తో దుబాయ్ పర్యాటకుల్ని వివేషంగా ఆకర్షిస్తోంది. రెసిడెంట్స్ అలాగే విజిటర్స్ ఈ వేడుకల్లో పాలుపంచుకోవచ్చు. రిటైల్ ప్రమోషన్స్‌లో పాల్గొని మెగా ప్రైజ్‌లను సొంతం చేసుకోవచ్చు. 12 ఇన్‌ఫినిటి క్యు 50 కార్లు ఈ ఫెస్టివల్‌లో పాల్గొనేవారు గెలుచుకునేందుకు అవకాశముంది. ఎంటర్‌టైన్‌మెంట్ వరకూ చూసుకుంటే ప్రపంచంలోనే అత్యుత్తమమైన ఎంటర్‌టైన్‌మెంట్ ఇచ్చే అనేక కార్యక్రమాలు డిఎస్‌ఎస్‌లో భాగం కానున్నాయి. యాంగ్రీ బర్డ్స్, ఫ్యాషన్ ఫార్వార్డ్ సమ్మర్ పాపప్, హాస్‌బ్రో గేమ్స్, సేవ్ ఆన్ సమ్మర్, జంగిల్ బుక్ (వరల్డ్ క్లాస్ లైవ్ షో) వంటివి ప్రధాన ఆకర్షణలు.
తాజా వార్తలు
- దసరా ఉత్సవాలు..ఏపీకి రానున్న రాష్ట్రపతి
- దుబాయ్ మాల్లో ఏఐ ఆధారిత సైబర్ నేరాల పై అవగాహన కార్యక్రమం
- తొమ్మిది రోజుల బతుకమ్మ పండుగ విశిష్టత ఏమిటి?
- గుల్మార్గ్లో రక్షణ శాఖ ఉన్నతాధికారులతో సమావేశానికి అధ్యక్షత వహించిన ఎంపీ బాలశౌరి
- ఇంద్రకీలాద్రి దసరా ఉత్సవాల దర్శన టికెట్లలో కీలక మార్పులు
- ఇక పై అమెరికన్లనే ఉద్యోగాల్లో నియమించుకుంటాం: టీసీఎస్
- బహ్రెయిన్‌లో ప్రవాసుల ఉద్యోగాల కోసం స్థానికులకు శిక్షణ..!!
- ఒమన్‌లో RO 2 మిలియన్లతో ఇళ్ల నిర్మాణం.. పేద కుటుంబాలకు ఊరట..!!
- కువైట్‌లో 153 రోజుల్లో 11మిలియన్ల ట్రాఫిక్ ఉల్లంఘనలు..!!
- సౌదీపై దాడులను ఖండించిన ఫ్రాన్స్ సహా పలు దేశాలు..!!







