ఆరు బ్యూటీ సెలూన్స్ మూసివేతకు కతర్ మంత్రిత్వ శాఖ నిర్ణయం
- July 09, 2016
గడువు ముగిసిన నాసిరకపు కాలం చెల్లిన జుట్టుకు ఉపయోగించే ఉత్పత్తులను ఉపయోగిస్తున్నారనే ఆరోపణతో 1-2 వారాల వ్యవధిలో ఆయా దుకాణాలను త్వరలో మూసివేయాలని ఆర్ధిక మరియు వాణిజ్య మంత్రిత్వ శాఖ ఆదేశించింది. ఈ తరహా ప్రశ్నలను ఎదుర్కొన్న వా 'అబ్ , అల్ దహీల్ , సల్వా రోడ్, అల్ కిస్సా మరియు అల్-మెర్కాబ్ అల్ జడిడ్ తదితర ప్రదేశాలు ఉన్నాయి.
ఈ సెలూన్ల మూసివేత వార్తలు ఆన్లైన్ లో ప్రచారం కాబడ్డాయి. స్త్రీ వినియోగదారులు ఎక్కువగా సందర్శించే వారిలో ఉండటంతో వెంటనే వారు నిరాశ మరియు ఆదుర్దా భావన వ్యక్తం చేశారు. ఈ సెలూన్ల లలో వారు జుట్టుకి రంగు వేయడం ,ఆవిరి పట్టించడం , చర్మంకు మసాజ్ మొదలైనవి సేవలను ఇక్కడ పొందేవారు.
ఖతార్ దేశ మెట్రోలాజికల్ శాఖ సూచించిన విధానాలను అనుసరించడంలో విఫలమైతే, ఆ రకమైన సరుకును దిగుమతి 4 వ చట్టం కింద 1990 ప్రకారం వారు ఉల్లంఘనకు పాల్పడినట్లు పరిగణిస్తారు. ఆరోగ్య నిపుణులు పదేపదే నాసిరకం లేదా గడువు అందం ఉత్పత్తులు ఉపయోగించవద్దని హానికరమైన ప్రభావాలు గురించి హెచ్చరికలు జారీ చేసి నిషేధించబడుతుందని ముందే హెచ్చరించింది.
గడువు తీరిన అందంను మెరుగుపర్చే ఉత్పత్తులు ఉపయోగించి ప్రమాదాలను మహిళలు కొని తెచ్చుకొంటున్నారు. వాటి ద్వారా చర్మ అలెర్జీలు, క్యాన్సర్, శాశ్వత పిగ్మెంటేషన్ మొదలైనవి వచ్చే అవకాశాలు ఎక్కువని ఔషధ డాక్టర్ మహమ్మద్ అల్ అజ్మీ తెలిపారు.
తాజా వార్తలు
- దసరా ఉత్సవాలు..ఏపీకి రానున్న రాష్ట్రపతి
- దుబాయ్ మాల్లో ఏఐ ఆధారిత సైబర్ నేరాల పై అవగాహన కార్యక్రమం
- తొమ్మిది రోజుల బతుకమ్మ పండుగ విశిష్టత ఏమిటి?
- గుల్మార్గ్లో రక్షణ శాఖ ఉన్నతాధికారులతో సమావేశానికి అధ్యక్షత వహించిన ఎంపీ బాలశౌరి
- ఇంద్రకీలాద్రి దసరా ఉత్సవాల దర్శన టికెట్లలో కీలక మార్పులు
- ఇక పై అమెరికన్లనే ఉద్యోగాల్లో నియమించుకుంటాం: టీసీఎస్
- బహ్రెయిన్‌లో ప్రవాసుల ఉద్యోగాల కోసం స్థానికులకు శిక్షణ..!!
- ఒమన్‌లో RO 2 మిలియన్లతో ఇళ్ల నిర్మాణం.. పేద కుటుంబాలకు ఊరట..!!
- కువైట్‌లో 153 రోజుల్లో 11మిలియన్ల ట్రాఫిక్ ఉల్లంఘనలు..!!
- సౌదీపై దాడులను ఖండించిన ఫ్రాన్స్ సహా పలు దేశాలు..!!







