సెనెగల్‌ స్కూల్‌ కోసం దుబాయ్‌ కేర్స్‌ విజ్ఞప్తి

- July 09, 2016 , by Maagulf
సెనెగల్‌ స్కూల్‌ కోసం దుబాయ్‌ కేర్స్‌ విజ్ఞప్తి

దుబాయ్‌ కేర్స్‌, వాలంటీర్ల కోసం పిలుపునిచ్చింది. వారం పాటు జరిగే స్కూల్‌ బిల్డింగ్‌ మిషన్‌ కోసం వాలంటీర్లు కావాల్సిందిగా దుబాయ్‌ కేర్స్‌ పేర్కొంది. అక్టోబర్‌ 30 నుంచి నవంబర్‌ 6 వరకు సెనెగల్‌లోని ఫాటిక్‌ డిస్ట్రిక్ట్‌లో ఈ కార్యక్రమాన్ని చేపడతారు. వాలెంటీర్లు ఆఫ్రికాకి వెళ్ళి అక్కడ స్థానికంగా ఉన్నవారికి కొత్త స్కూల్‌ నిర్మాణంలో సహకరించాల్సి ఉంటుంది. ఈ స్కూల్‌ సుమారు 150 మంది చిన్నారులకు ఉపయోగరంగా ఉండనుంది. 17 జులై లోపల ఔత్సాహికులు రిజిస్టర్‌ చేసుకోవాల్సి ఉంటుంది. దుబాయ్‌ కేర్స్‌ 50 మందిని 'ఫస్ట్‌ కమ్‌ ఫస్ట్‌' అనే పద్ధతిలో ఎంపిక చేస్తుంది. వీరి నుంచి 15 మందిని ఇంటర్వ్యూల ద్వారా ఫైనలైజ్‌ చేస్తుంది. జులై 23 నుంచి 31 వరకు ఇంటర్వ్యూలు జరుగుతాయి. మరో 15 మంది వలంటీర్స్‌ని వెయిటింగ్‌ లిస్ట్‌లో ఉంచుతారు. ఆసక్తి కలవారు ఈ కింద లింక్ ద్వారా పేరు నమోదు చేసుకోగలరు.

https://docs.google.com/forms/d/159zvehDgqYsxT5cXagMHb763Q7kYdAkT-kpXiCgMMb8/viewform?c=0&w=1

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com