బహ్రెయిన్‌లో నేవీ మెంబర్స్‌కి పూర్తి ఫర్నిష్డ్ ఫ్లాట్స్
- July 09, 2016
బహ్రెయిన్‌కి వెళ్ళే యూఎస్ నేవీ సర్వీస్ మెంబర్స్ కోసం పూర్తిస్థాయిలో సౌకర్యాలున్న ఫ్లాట్స్ సిద్ధమవుతున్నాయి. బహ్రెయిన్‌లో పూర్తిస్థాయిలో తయారు కాని అపార్ట్‌మెంట్లు మరియు విల్లాల్లో 500 మంది యూఎస్ డిఫెన్స్ డిపార్ట్‌మెంట్ మెంబర్స్ ఉంటున్నారు. వారి ఇబ్బందుల్ని తొలగించడానికి ఈ ఏర్పాట్లు చేశారు. 45 రోజుల తాత్కాలిక లాడ్జింగ్ అలవెన్స్‌ని మించి ఉండాల్సిన సందర్భంలో అదనపు ఖర్చులతో సిబ్బంది తీవ్రంగా ఇబ్బందులు పడుతుండాన్ని చూసి, ఈ నిర్ణయాన్ని తీసుకున్నట్లు నావల్ సపోర్ట్ యాక్టివిటీ బహ్రెయిన్ కమాండర్ కెప్టెన్ కోరీ హోవెస్ చెప్పారు. పర్సనల్ ప్రాపర్టీ ఆఫీస్‌ని సంప్రదించి, ఎస్టిమేటెడ్ డెలివరీ డేట్‌ని పొందవచ్చనీ, టిఎల్‌ఎ ఎక్స్‌పిరేషన్ డేట్ తర్వాత ఎస్టిమేటెడ్ డెలివరీ డేట్ ఉంటే, హౌసింగ్ ఆఫీస్ వారికి ఫర్నిష్డ్ అపార్ట్‌మెంట్స్‌లోకి మంత్ టు మంత్ లీజ్ బేసిస్‌లో పంపుతుంది. ఈ కొత్త విధానం ద్వారా హోటళ్ళలో బస చేసే ఖర్చులు తగ్గించుకోడానికి వీలుంటుందనీ, తద్వారా ఉద్యోగులకు ఇబ్బందులు తొలగుతాయని అధికారులు చెప్పారు.
తాజా వార్తలు
- అమెజాన్‌లో రికార్డు స్థాయి అమ్మకాలు..
- CJP అధ్యక్షుడు అభిజీత్ దీప్కే అరెస్ట్
- తిరుమలలో మరోసారి బ్రహ్మోత్సవాల సందడి
- ‘RTC’ ఎన్నికల్లో EU కూటమి విజయం!
- లుసైల్ బౌలేవార్డ్పై నేడు ట్రాఫిక్ ఆంక్షలు..!!
- అబుధాబిలో మూడు రోజుల పాటు రహదారి మూసివేత..!!
- కువైట్‌లో రోడ్డుపై వ్యర్థాలు.. ట్రక్ డ్రైవర్ పై బహిష్కరణ వేటు..!!
- పోస్టల్ అభివృద్ధి సూచీలో ఒమన్‌కు అగ్రస్థానం..!!
- రియాద్‌లో కొత్త తుమామా రోడ్ బ్రిడ్జి ప్రారంభం..!!
- బహ్రెయిన్‌లో ఈ-స్కూటర్లపై కఠిన నిబంధనలు..!!







