షేక్ హమద్ అవార్డు.. 32 దేశాల నుండి 287 ఎంట్రీలు..!!

- May 11, 2025 , by Maagulf
షేక్ హమద్ అవార్డు.. 32 దేశాల నుండి 287 ఎంట్రీలు..!!

దోహా, ఖతార్: షేక్ హమద్ అవార్డు ఫర్ ట్రాన్స్లేషన్ అండ్ ఇంటర్నేషనల్ అండర్స్టాండింగ్ (SHTAIU) 2025లో దాని 11వ ఎడిషన్ కోసం నామినేషన్లను మూసివేస్తున్నట్లు ప్రకటించింది. దాని వివిధ విభాగాలలో 287 దరఖాస్తులు అందాయని తెలిపింది. 2024తో పోలిస్తే 5 శాతం పెరుగుదలను నమోదు చేసిందని, సంస్థాగత భాగస్వామ్యం 26 శాతంగా ఉందని, మహిళా ప్రాతినిధ్యం మొత్తం సమర్పణలలో 30 శాతానికి చేరుకుందని, ఈ సంవత్సరం 32 దేశాల నుండి ఎంట్రీలు వచ్చినట్లు వెల్లడించింది. 

జర్మన్ నుండి అరబిక్‌లోకి సమర్పణలు 52 శాతం పెరిగాయని, అరబిక్ నుండి జర్మన్‌లోకి ఎంట్రీలు ఐదు రెట్లు పెరిగాయి. టర్కిష్ భాష విషయానికొస్తే, మూడు సంవత్సరాల క్రితం మాత్రమే ప్రధాన భాషగా గుర్తించినప్పటికీ ఒకే తీరుగా దరఖాస్తులు వస్తున్నాయని SHTAIU అధికారిక ప్రతినిధి అబ్దుల్‌రెహ్మాన్ అల్ మురైఖీ తెలిపారు.    

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com