ఖతార్ లో 7 శాతం పెరిగిన FDI లు..!!
- February 26, 2026
దోహా: 2025 మూడవ త్రైమాసికానికి ఖతార్ విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల (FDI) సర్వే ఫలితాలను ఖతార్ సెంట్రల్ బ్యాంక్ సహాయంతో జాతీయ ప్రణాళిక మండలి (NPC) విడుదల చేసింది. ఇన్‌వర్డ్ FDI స్థానాల్లో 7% వృద్ధి చెందిందని వెల్లడించింది.ఖతార్ ఆర్థిక వ్యవస్థ పై విదేశీ పెట్టుబడిదారులలో బలమైన విశ్వాసాన్ని ఈ పెరుగుదల ప్రతిబింబిస్తుందని పేర్కొంది.
ఈ పనితీరు ఖతార్ నేషనల్ విజన్ 2030 లక్ష్యాలతో, ముఖ్యంగా ఆర్థిక అభివృద్ధిని ముందుకు తీసుకెళ్లడంలో జాతీయ పోటీతత్వాన్ని పెంచడానికి దోహదం చేస్తుందన్నారు. 2025 జూలై నుండి సెప్టెంబర్ వరకు ఇన్‌వర్డ్ మరియు అవుట్‌వర్డ్ FDI స్థానాల ప్రాథమిక అంచనాలను ఈ ఫలితాలు విశ్లేషించాయి. సర్వేలో సుమారు 200 ప్రైవేట్ రంగ సంస్థలతోపాటు ఎంపిక చేసిన ప్రభుత్వ యాజమాన్యంలోని కంపెనీల డేటాను పరిగణనలోకి తీసుకుని ఫలితాలను వెల్లడించారు.
2025 రెండవ త్రైమాసికంతో పోలిస్తే 2025 మూడవ త్రైమాసికం చివరిలో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు (FDI) స్థానాలు 7% పెరిగి, సుమారు QR157 బిలియన్లకు చేరుకున్నాయని సర్వే ఫలితాలు స్పష్టం చేశాయి.మైనింగ్ మరియు క్వారీయింగ్ 44%, ఆర్థిక మరియు భీమా కార్యకలాపాలు 32%, తయారీ 15%, శాస్త్రీయ మరియు సాంకేతిక కార్యకలాపాలు 5% మరియు ప్రజా పరిపాలన 2% చోప్పున నమోదు కాగా..ఈ ముఖ్యమైన ఐదు రంగాలలో 95% కంటే ఎక్కువ FDI వచ్చాయని జాతీయ ప్రణాళిక మండలి డేటా వెల్లడించింది.
తాజా వార్తలు
- AED80 మిలియన్ పెట్టుబడితో ‘దుబాయ్ క్రీక్ లైట్స్’ ప్రాజెక్ట్‌కు శ్రీకారం..
- విశాఖపట్నంలో ఐబిఎం ‘ఫ్యూచర్‌నౌ’ కేంద్రం ప్రారంభం
- తెలంగాణలో ‘డయల్ 112’ సేవలు ప్రారంభించిన డీజీపీ సి.వి.ఆనంద్
- పాస్‌పోర్ట్ సేవల పెండింగ్‌ను త్వరగా పరిష్కరిస్తాం: కాన్సుల్ జనరల్ డా.విష్ణువర్ధన్ రెడ్డి
- దుబాయ్ సౌత్‌లో వర్క్‌షాప్ ప్రమాదంతో భారీ అగ్నిప్రమాదం.. పలు ట్రక్కులు, కారవాన్లు దగ్ధం
- హీట్ ఎగ్జాస్షన్, చర్మ గాయాలపై యూఏఈ నిపుణుల హెచ్చరిక..!!
- ఒమాన్‌లో పొగమంచు హెచ్చరిక జారీ..!!
- మద్యం మత్తులో డ్రైవింగ్.. ఒకరి మృతి, 8 మందికి గాయాలు..!!
- ఖతార్ ఎయిర్వేస్ విమానాల్లో ‘నబ్ద్ ఖతార్’ అనుభవం..!!
- అనుమతి లేని ప్రాంతాల్లో ఈతకు వెళ్లొద్దు..!!







