యూఎస్-చైనా వాణిజ్య చర్చలు..Dh5 తగ్గిన బంగారం ధరలు..!!

- May 12, 2025 , by Maagulf
యూఎస్-చైనా వాణిజ్య చర్చలు..Dh5 తగ్గిన బంగారం ధరలు..!!

యూఏఈ: యూఎస్-చైనా వాణిజ్య చర్చల నేపథ్యంలో అమెరికా డాలర్ బలపడింది. దాంతో బంగారం ధర ఔన్సుకు $3,300 కంటే తక్కువగా చేరింది. సోమవారం ఉదయం దుబాయ్‌లో బంగారం ధరలు గ్రాముకు Dh5 కంటే ఎక్కువగా పడిపోయి Dh400 కంటే తక్కువగా వచ్చాయి.

యూఏఈ సమయం ప్రకారం ఉదయం 9 గంటలకు.. 24-క్యారెట్లు గ్రాముకు Dh395.25 వద్ద ప్రారంభమయ్యాయి.  గత వారం మార్కెట్లు ముగిసే సమయానికి గ్రాముకు Dh400.5 వద్ద ఉంది. ఇతర వేరియంట్లలో 22-క్యారెట్లు, 21-క్యారెట్లు మరియు 18-క్యారెట్లు వరుసగా గ్రాముకు Dh366, Dh350.75 మరియు Dh300.75కి తగ్గాయి. స్పాట్ గోల్డ్ ఔన్స్‌కు $3,277.53 వద్ద ట్రేడవుతోంది. ఇది 1.5 శాతం తగ్గింది.    

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com