సౌదీ అరేబియా సిటీ బస్ నెట్‌వర్క్‌.. క్యూ1లో ప్రయాణికుల సంఖ్యలో భారీ వృద్ధి..!!

- May 12, 2025 , by Maagulf
సౌదీ అరేబియా సిటీ బస్ నెట్‌వర్క్‌.. క్యూ1లో ప్రయాణికుల సంఖ్యలో భారీ వృద్ధి..!!

రియాద్: సౌదీ నగరాల్లోని ప్రభుత్వ బస్సు రవాణా నెటవర్క్ లు 2025 మొదటి త్రైమాసికంలో ప్రయాణికుల సంఖ్యలో గణనీయమైన పెరుగుదలను నమోదు చేశాయి. ట్రాన్స్‌పోర్ట్ జనరల్ అథారిటీ (TGA) విడుదల చేసిన త్రైమాసిక డేటా ప్రకారం.. 15 నగరాల్లో 23 మిలియన్ల మంది ప్రయాణికుల సంఖ్యను అధిగమించాయి.

2024 నాల్గవ త్రైమాసికంతో పోలిస్తే Q1 మొత్తం 34% పెరుగుదలను నమోదు చేశాయి. ఇది సిటీ బస్ నెటవర్క్ పై నమ్మకాన్ని తెలియజేస్తుందన్నారు.  రియాద్‌లో ప్రయాణికుల సంఖ్య 15 మిలియన్లను దాటగా.. మక్కాలో 4 మిలియన్లకు పైగా ప్రయాణికుల సంఖ్య నమోదైంది.  ఇక మదీనాలో 1.3 మిలియన్లకు పైగా ప్రయాణికులు ప్రయాణించగా, జెడ్డాలో 1.1 మిలియన్లకు పైగా ప్రయాణికులు ప్రయాణించారు. తూర్పు ప్రాంతంలో (దమ్మామ్, ఖతీఫ్) 748,000 మందికి పైగా ప్రయాణికులు ప్రభుత్వ బస్సు సేవలను ఉపయోగించారు.  ఖాసిమ్‌లో 193,000 మందికి పైగా ప్రయాణికులు ప్రయాణించగా, తైఫ్‌లో 161,000 మందికి పైగా ప్రయాణికులు ప్రయాణించారు.  జాజాన్‌లో 104,000 మందికి పైగా ప్రయాణికులు ప్రయాణించారని నివేదిక వెల్లడించింది.  

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com