సౌదీ అరేబియాలో ముగిసిన ట్రంప్ చారిత్రాత్మక పర్యటన..!!
- May 15, 2025
రియాద్: సౌదీ అరేబియాలో అమెరికా ప్రెసిడెంట్ ట్రంప్ పర్యటన విజయవంతంగా ముగిసింది. తన పర్యటనలో భాగంగా పలు కీలక ఒప్పందాలపై సంతకాలు చేశారు. సౌదీతో వ్యూహాత్మక ఆర్థిక భాగస్వామ్యంపై ఒప్పందం, సౌదీ-యుఎస్ ఇన్వెస్ట్మెంట్ ఫోరం, గల్ఫ్-యుఎస్ సమ్మిట్‌లో పాల్గొనడం, సిరియా కొత్త నాయకత్వంతో కూడిన చారిత్రాత్మక సమావేశంలో ట్రంప్ పాల్గొన్నారు. మూడు దేశాల గల్ఫ్ పర్యటనలో భాగంగా ట్రంప్ ఖతార్‌కు బయలుదేరారు.
అంతకుముందు క్రౌన్ ప్రిన్స్ మరియు ప్రధాన మంత్రి మొహమ్మద్ బిన్ సల్మాన్.. రియాద్‌లోని కింగ్ ఖలీద్ అంతర్జాతీయ విమానాశ్రయంలో ట్రంప్‌కు స్వాగతం పలికారు. అల్-యమామా ప్యాలెస్‌లో సౌదీ-యుఎస్ సమ్మిట్‌లో పాల్గొన్నారు. రెండు దేశాల మధ్య వ్యూహాత్మక ఆర్థిక భాగస్వామ్యంపై సంతకం చేశారు. రక్షణ, ఇంధనం, న్యాయం, ఆరోగ్యం, అంతరిక్షం, శాస్త్రీయ పరిశోధన వంటి కీలక రంగాలలో అనేక ఒప్పందాలను కుదర్చుకున్నారు.
ఈ పర్యటనలో రియాద్‌లో జరిగిన యుఎస్-గల్ఫ్ సమ్మిట్ లో కూడా పాల్గొన్నారు. ఇక్కడ యుఎస్-జిసిసి వ్యూహాత్మక సంబంధాలపై ట్రంప్ ప్రసంగించారు. క్రౌన్ ప్రిన్స్ మొహమ్మద్ బిన్ సల్మాన్ 2024లో జిసిసి దేశాలు- యుఎస్ మధ్య వాణిజ్యం దాదాపు $120 బిలియన్లకు చేరుకుందని, యుఎస్ కీలకమైన వాణిజ్య భాగస్వామిగా ఉందని తెలిపారు.
సౌదీ నుంచి ట్రంప్ సిరియాపై అమెరికా ఆంక్షలను పూర్తిగా తొలగిస్తున్నట్లు ప్రకటించారు. కొత్త సిరియన్ ప్రభుత్వంతో సంబంధాలను సాధారణీకరించే ప్రక్రియను ప్రారంభించారు. క్రౌన్ ప్రిన్స్ నిర్వహించిన త్రైపాక్షిక సమావేశం తర్వాత ఈ మేరకు ప్రకటించారు. డిసెంబర్లో బషర్ అల్-అసద్ పతనం తర్వాత పదవీ బాధ్యతలు స్వీకరించిన అల్-షరా.. ఆంక్షలను ఎత్తివేసినందుకు ట్రంప్‌కు కృతజ్ఞతలు తెలిపారు. ఇది సిరియాను పునర్నిర్మించడంలో కీలకమైన అడుగు అని అన్నారు. ఈ పర్యటన సందర్భంగా ట్రంప్ క్రౌన్ ప్రిన్స్‌తో కలిసి దిరియాను సందర్శించి, అక్కడి చారిత్రక ప్రాముఖ్యత గురించి అడిగి తెలుసుకున్నారు.
తాజా వార్తలు
- ఇడాహోలో ఖతార్ ఎయిర్ ఫోర్స్.. అమెరికాతో ఒప్పందం..!!
- స్పేస్ సైన్స్.. అమెరికాలో 267 మంది సౌదీ స్టూడెంట్స్..!!
- ఓవర్‌టేకింగ్, లేన్ స్కిప్పింగ్.. డ్రోన్లతో ట్రాఫిక్ పర్యవేక్షణ..!!
- అలెర్ట్: ఫుజైరాలో భారీ వర్షాలు..వాటర్ ఫాల్స్ కనువిందు..!!
- ప్రైవేట్ స్కూళ్లలో సంస్కరణలకు బహ్రెయిన్ శ్రీకారం..!!
- షురా కౌన్సిల్ ను సందర్శించిన భారత ప్రతినిధి బృందం..!!
- ఆర్చరీ ప్రీమియర్ లీగ్ విజయం తర్వాత ప్రధాని మోదీని కలిసిన రామ్ చరణ్
- ఘనంగా ఫిలింఫేర్ అవార్డుల ప్రదానోత్సవం..
- పాపికొండల విహారయాత్ర రీస్టార్ట్
- తెలంగాణకు ఐకానిక్ గా టీస్క్వేర్ నిర్మాణం: సీఎం రేవంత్