జాయెద్ అంతర్జాతీయ విమానాశ్రయంలో మాదకద్రవ్యాలు స్వాధీనం..!!
- May 15, 2025
యూఏఈ: జాయెద్ అంతర్జాతీయ విమానాశ్రయంలో 5 కిలోల గంజాయిని అక్రమంగా రవాణా చేసే ప్రయత్నాన్ని అధికారులు భగ్నం చేశారని ఫెడరల్ అథారిటీ ఫర్ ఐడెంటిటీ, నేషనలిటీ, కస్టమ్స్ మరియు పోర్ట్స్ సెక్యూరిటీ వెల్లడించింది.
అధికారిక వర్గాల సమాచారం ప్రకారం.. విమానాశ్రయంలోని అధునాతన స్క్రీనింగ్ వ్యవస్థల ద్వారా ప్రయాణీకుడి సామానును తనిఖీ చేయగా, గంజాయి దాచిన విషయం బయటికొచ్చింది. అనంతరం నిందితుడిని అరెస్ట్ చేసినట్లు తెలిపారు.
మాదకద్రవ్య గుర్తింపులో శిక్షణ పొందిన కస్టమ్స్ , సెక్యూరిటీ సపోర్ట్ మేనేజ్మెంట్ నుండి ప్రత్యేక K9 కస్టమ్స్ డాగ్ బృందాల సహకారంతో ఈ ఆపరేషన్ నిర్వహించారు.
తాజా వార్తలు
- ఘనంగా GTWCA 19వ బతుకమ్మ సంబరాలు..
- దుబాయ్లో మిడిల్ ఈస్ట్ లోని అతిపెద్ద జ్యువెలరీ డెస్టినేషన్ ప్రారంభం
- దుబాయ్ మెట్రో నుంచి ఎతిహాద్ రైల్ స్టేషన్కు నడక మార్గం.. కొత్త పాదచారుల బ్రిడ్జి ప్రారంభం
- సౌదీ రక్షణ మంత్రితో షేక్ మన్సూర్ బిన్ జాయెద్ భేటీ
- ఇరాన్ అణు సామర్థ్యం పై ట్రంప్ వ్యాఖ్యలు
- బహ్రెయిన్లో అద్దెదారులకు ఊరట..?
- ఒమన్లో ప్రవాస మహిళలు అరెస్ట్..!!
- సౌదీలో నాలుగు ప్రాంతాలకు రెడ్ అలెర్ట్ జారీ..!!
- ప్రాంతీయ భద్రతను మరింత బలోపేతం చేయాలి..!!
- అబుదాబిలో 9,237 ఈ-స్కూటర్లు సీజ్..!!







