అబుదాబిలో భారతీయ లస్సీ షాప్ తాత్కాలికంగా మూసివేత..!!
- August 15, 2026
అబుదాబి: ప్రజారోగ్యానికి ముప్పు కలిగించే విధంగా ఆహార భద్రతా నిబంధనలు ఉల్లంఘించినందుకు అబుదాబిలోని ‘ది లస్సీ షాప్’కు చెందిన ఓ శాఖను అధికారులు తాత్కాలికంగా మూసివేశారు.
అబుదాబి అగ్రికల్చర్ అండ్ ఫుడ్ సేఫ్టీ అథారిటీ (ADAFSA) ఆగస్టు 14న ఈ మేరకు పరిపాలనా మూసివేత ఉత్తర్వులు జారీ చేసింది. ఆహార భద్రతా తనిఖీల్లో సదరు దుకాణంలో పదేపదే నిబంధనల ఉల్లంఘనలు గుర్తించినట్లు అధికారులు తెలిపారు. గతంలో గుర్తించిన లోపాలను సరిదిద్దేందుకు దుకాణం సమర్థవంతమైన చర్యలు తీసుకోకపోవడంతో వినియోగదారుల ఆరోగ్యం, ఆహార భద్రతను దృష్టిలో ఉంచుకుని తక్షణ చర్యలు తీసుకున్నట్లు పేర్కొన్నారు.
అబుదాబి ఎమిరేట్‌లో ఆహార భద్రతకు సంబంధించిన 2008 నాటి చట్టం నంబర్ 2తో పాటు దాని కింద జారీ చేసిన నిబంధనలను దుకాణం ఉల్లంఘించినట్లు ADAFSA వెల్లడించింది. ఆహార సంస్థల్లో నిబంధనల ఉల్లంఘనలు, ఆహార పదార్థాలపై అనుమానాలు లేదా ఇతర సమస్యలు కనిపిస్తే ప్రజలు అధికారులకు ఫిర్యాదు చేయాలని సూచించింది. ఇందుకోసం అబుదాబి ప్రభుత్వ టోల్‌ఫ్రీ నంబర్ 800555కు సమాచారం అందించవచ్చని తెలిపింది.
తాజా వార్తలు
- యూఏఈలో ప్రభుత్వ సేవలకు ఏఐ అసిస్టెంట్ ‘మీరా’..!!
- ఒమన్‌లో ఘోర రోడ్డు ప్రమాదం.. నలుగురు మృతి, 17 మందికి గాయాలు..!!
- కువైట్‌లో నవంబర్ 30న అంతర్జాతీయ స్టార్టప్ పోటీ..!!
- బహ్రెయిన్‌లో సందడిగా న్యూ ఇండియన్ స్కూల్ వార్షికోత్సవం..!!
- ఖతార్‌లో ఈ టాబ్లెట్ రీకాల్..!!
- నేపాల్ కు రూ.15 వేల కోట్ల సాయం–ప్రధాని మోదీ
- సౌదీ అరేబియాలో పెరిగిన నిర్మాణ వ్యయాలు..!!
- హైదరాబాద్‌లో బాంబు బెదిరింపు.. కాచిగూడ రైల్వే స్టేషన్ టార్గెట్‌గా మెయిల్
- కువైట్‌లో ‘ఏక్ పేడ్ మా కే నామ్’.. చిన్నారుల సందడి..!!
- ఒమన్‌లో సబ్సిడీ కార్డుల ద్వారా డీజిల్ విక్రయాలు..!!







