జెడ్డా పోర్టులో 58.6 కిలోల మెథాంఫెటమైన్ పట్టివేత..!!

- August 15, 2026 , by Maagulf
జెడ్డా పోర్టులో 58.6 కిలోల మెథాంఫెటమైన్ పట్టివేత..!!

జెడ్డా: సౌదీ అరేబియాలో భారీగా మాదకద్రవ్యాల అక్రమ రవాణా యత్నాన్ని కస్టమ్స్ అధికారులు భగ్నం చేశారు. జెడ్డా ఇస్లామిక్ పోర్టుకు వచ్చిన పురుషుల షూస్ సరుకులో దాచిన 58.6 కిలోల మెథాంఫెటమైన్ (షాబు)ను స్వాధీనం చేసుకున్నారు.

జకాత్, ట్యాక్స్ అండ్ కస్టమ్స్ అథారిటీ (ZATCA) ప్రతినిధి హమ్మౌద్ అల్ హర్బీ తెలిపిన వివరాల ప్రకారం.. షూస్‌లో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన ఖాళీ ప్రదేశాల్లో మెథాంఫెటమైన్‌ను దాచినట్లు అధికారులు గుర్తించారు. మాదకద్రవ్యాలను స్వాధీనం చేసుకున్న అనంతరం.. సౌదీ అరేబియాలో వాటిని స్వీకరించాల్సిన వ్యక్తులను గుర్తించి అరెస్టు చేసేందుకు ZATCA, జనరల్ డైరెక్టరేట్ ఆఫ్ నార్కోటిక్స్ కంట్రోల్‌తో కలిసి చర్యలు చేపట్టింది. ఈ కేసులో ముగ్గురిని అరెస్టు చేశారు.


సౌదీ అరేబియాకు దిగుమతులు, ఎగుమతులపై కస్టమ్స్ నియంత్రణలను మరింత కఠినతరం చేస్తున్నామని అల్ హర్బీ తెలిపారు. దేశ భద్రత, ప్రజల రక్షణలో భాగంగా అక్రమ రవాణా ప్రయత్నాలపై నిఘా కొనసాగిస్తామని చెప్పారు.

అక్రమ రవాణాను అరికట్టడంలో ప్రజలు కూడా సహకరించాలని ZATCA కోరింది. అనుమానాస్పద ఘటనలపై 1910 హాట్‌లైన్‌కు, [email protected] ఈమెయిల్‌కు లేదా అంతర్జాతీయ నంబర్ +966 11 910కు సమాచారం ఇవ్వవచ్చని తెలిపింది. అక్రమ రవాణా, యూనిఫైడ్ కస్టమ్స్ లా ఉల్లంఘనలకు సంబంధించిన సమాచారాన్ని పూర్తిగా గోప్యంగా ఉంచుతామని అధికారులు తెలిపారు. సమాచారం నిజమని నిర్ధారణ అయితే ఫిర్యాదు చేసిన వారికి ఆర్థిక బహుమతులు కూడా అందజేస్తామని వెల్లడించారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com