ఇల్లీగల్ మనామా స్ట్రీట్ వెండర్స్.. 44 ట్రక్కుల వ్యర్థాలు తొలగింపు..!!

- May 16, 2025 , by Maagulf
ఇల్లీగల్ మనామా స్ట్రీట్ వెండర్స్.. 44 ట్రక్కుల వ్యర్థాలు తొలగింపు..!!

మనామా: సంవత్సరం మొదటి త్రైమాసికంలో మనామా వీధుల్లో 44 ట్రక్కుల లైసెన్స్ లేని విక్రేత సామగ్రిని తొలగించినట్లు క్యాపిటల్ ట్రస్టీస్ బోర్డు సమావేశంలో వెల్లడించారు. ఇతర సంస్థలతో కలిసి ఇటీవల నిర్వహించిన స్వీప్‌ల గురించి కౌన్సిల్ సభ్యులకు వివరణాత్మక బ్రీఫింగ్‌ అందజేశారు.   లైసెన్స్ లేని అమ్మకాలను నియంత్రించడం, హాకర్లచే తరచుగా బ్లాక్ చేయబడుతున్న ప్రదేశాలను వినియోగంలోకి తీసుకురావడం దీని లక్ష్యమని ఇన్‌స్పెక్షన్ యాక్టింగ్ డైరెక్టర్ ఖలీఫా అల్ కాబి తెలిపారు.

భద్రతా నియమాలు

బహ్రెయిన్ పౌరులు మాత్రమే వీధి విక్రయ కేంద్రానికి దరఖాస్తు చేసుకోవచ్చు. వారు నిరుద్యోగులుగా ఉండాలి. కనీసం 21 సంవత్సరాల వయస్సు కలిగి ఉండాలి.  ఆమోదించబడిన ప్రదేశాలలో వ్యాపారం చేసేటప్పుడు భద్రతా నియమాలను పాటించాలి. క్లీనింగ్ యాక్టింగ్ హెడ్ యూసిఫ్ అల్ బన్నై మాట్లాడుతూ.. ముఖ్యంగా రాజధానిలోని రద్దీ ప్రాంతాలలో విదేశీ హాకర్ల సమస్య అధికంగా ఉందని అన్నారు.  జనవరి, మార్చి మధ్య పదకొండు ధపాలుగా తనిఖీలు నిర్వహించినట్లు తెలిపారు. ముఖ్యంగా షేక్ హమద్ అవెన్యూ, సాసా అవెన్యూ, జుబారా అవెన్యూ వంటి హాట్‌స్పాట్‌లలో తనిఖీలు ఫోకస్ చేశాయని వివరించారు.   

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com