జీసీసీ సందర్శకులను ఆకర్షించిన కట్టారా ఈద్ కార్యకలాపాలు
- July 10, 2016
ఈద్ అల్ ఫితర్ గుర్తుగా సాంస్కృతిక విలేజ్ ఫౌండేషన్- కట్టారా నిర్వహించిన నాలుగు రోజుల కార్యక్రమాలు కతర్ మరియు ఇతర జీసీసీ దేశాలు నుండి భారీగా ప్రేక్షకులను ఆకర్షించింది. " పిల్లల స్వప్నం " అనే అంశం పై జరిగిన ఒక సంగీత కార్యక్రమంలో అరబిక్ మరియు ఆంగ్లం లో రోజువారీ మూడు ప్రదర్శనలతో కట్టారా భారీ బహిరంగ స్థలంలో ప్రదర్శించబడింది. ఈ సంగీత కార్యక్రమంలో పిల్లల తన స్నేహితులతో ఈద్ సంబరాలు జరుపుకొన్నట్లు కల కంటుంది కట్టారా యొక్క ఈద్ పండుగ మొత్తం జీసీసీ లో ప్రసిద్ధి చెందింది. "నేను నా కుటుంబంతో పండుగ ఆస్వాదించడానికి ఇక్కడ వచ్చాము. మేము ఇక్కడ అన్ని కార్యక్రమాలు చూచి ఆనందించాము మరియు మేము అధికారులు అందించిన సౌకర్యాలు సంతోషంగా ఉన్నాయి హుస్సేన్ అల్ ఖలిది, సౌదీ అరేబియా పర్యాటకుడు తెలిపారు.
యుఎఇ నుంచి వచ్చిన మరో పర్యాటకుడు అహ్మద్ అల్ రషీద్ మాట్లాడుతూ తన స్నేహితులతో కలసి కట్టారా నిర్వహించిన అన్ని కార్యక్రమాలుచూడటానికి ఇక్కడ వచ్చినట్లు చెప్పారు. తనని తన స్నేహితులను ముఖ్యంగా ఎంతో ఆకర్షించిన ప్రదర్శన " పిల్లల స్వప్నం " అని తెలిపారు. కట్టారా జనరల్ మేనేజర్, డాక్టర్ ఖలీద్ బిన్ ఇబ్రాహీం అల్ సులైటి మాట్లాడుతూ కట్టారా గత ఏడాదితో పోలిస్తే ఈ సంవత్సరం కార్యక్రమాలను మరింత ఘనంగా నిర్వహించినట్లు చెప్పారు. ఈ కార్యక్రమాలు అన్ని ఎంతో వినోద, జ్ఞాన-ఆధారిత మొదలుకుని అన్ని వయసుల ప్రేక్షకులను అలరించేందుకు రూపొందించబడ్డాయి.
ఈ కార్యక్రమాలు కుటుంబాలతో మరియు స్నేహితులతో కలవడానికి ఒక మంచి అవకాశం. కతర్ యొక్క సాంస్కృతిక మరియు నిజమైన విలువలను పర్యాటక సన్నివేశంలో జోడించడానికి విస్తృత ప్రేక్షకుల ఆకర్షించడం తమ లక్ష్యమని ఆయన చెప్పారు. కట్టారా బీచ్ సైతం పండుగలకు సమయంలో భారీ సంఖ్యలో సందర్శకులను ఆకర్షించింది. సందర్శకులు కుటుంబ సభ్యులతో ఈత మరియు బీచ్ ఆటలతో ఆనందించారు.
తాజా వార్తలు
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్‌సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్‌పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్‌పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్‌కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!







