యూఏఈ నుండి బంగారం, వెండి దిగుమతులపై ఇండియా కఠిన నిబంధనలు..!!

- May 21, 2025 , by Maagulf
యూఏఈ నుండి బంగారం, వెండి దిగుమతులపై ఇండియా కఠిన నిబంధనలు..!!

యూఏఈ: భారతదేశం ఇటీవల విధించిన ఆంక్షలు.. యూఏఈ నుండి బంగారం, వెండి వంటి విలువైన లోహాలను వివిధ రూపాల్లో దిగుమతి చేసుకోవడంపై మరింత పారదర్శకత ద్వారా ద్వైపాక్షిక బంగారు వాణిజ్యాన్ని పునర్ నిర్వచించారు. భారతదేశ బడ్జెట్ 2025లో భాగంగా ప్రకటించిన ఈ విధానం.. ఇండియా-యూఏఈ సమగ్ర ఆర్థిక భాగస్వామ్య ఒప్పందం ( CEPA) కింద టాక్స్ రాయితీల దుర్వినియోగాన్ని అరికట్టే లక్ష్యంతో కొత్త హార్మోనైజ్డ్ సిస్టమ్ (HS) కోడ్‌లను పరిచయం చేసింది. ఇటీవలి సంవత్సరాలలో విపరీతమైన వృద్ధిని సాధించిన దుబాయ్ బంగారు వాణిజ్యానికి దీనితో ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు.

కొత్త నియమాలు దిగుమతిదారులు CEPA కింద తక్కువ దిగుమతి సుంకాలను ఉపయోగించుకోవడానికి, దాదాపు 99 శాతం స్వచ్ఛమైన బంగారాన్ని ప్లాటినం మిశ్రమంగా లేబుల్ చేయడానికి అనుమతించే లొసుగును లక్ష్యంగా చేసుకున్నాయి. 99 శాతం లేదా అంతకంటే ఎక్కువ స్వచ్ఛత కలిగిన ప్లాటినం కోసం నిర్దిష్ట HS కోడ్‌ను ప్రవేశపెట్టడం ద్వారా నిజమైన ప్లాటినం దిగుమతులు మాత్రమే సుంకం రాయితీలకు అర్హత పొందుతాయని ఇండియా భావిస్తుంది. దీనితోపాటు విలువైన లోహాల దిగుమతులు ఇప్పుడు నామినేటెడ్ ఏజెన్సీలు, అర్హత కలిగిన ఆభరణాల వ్యాపారులు, CEPA కింద చెల్లుబాటు అయ్యే టారిఫ్ రేటు కోటా (TRQ) హోల్డర్లకు పరిమితం అయ్యాయి. 

భారత వాణిజ్య, పరిశ్రమల మంత్రిత్వ శాఖ డేటా ప్రకారం.. యూఏఈ నుండి భారతదేశం బంగారం దిగుమతులు ఇటీవలి సంవత్సరాలలో పెరిగాయి. 2023 ఆర్థిక సంవత్సరంలో $3.5 బిలియన్ల నుండి 2024 ఆర్థిక సంవత్సరంలో $10.7 బిలియన్లకు పెరిగాయి. యూఏఈ నుండి మొత్తం దిగుమతుల్లో 9.8 శాతం తగ్గుదల ఉన్నప్పటికీ ఈ పెరుగుదల నమోదు కావడం గమనార్హం. అదే సమయంలో CEPA కింద సుంకాల రాయితీలు దుర్వినియోగానికి గురయ్యే అవకాశం ఉందని గ్లోబల్ ట్రేడ్ రీసెర్చ్ ఇనిషియేటివ్ (GTRI) 2024లో హెచ్చరించింది. 

IBMC ఫైనాన్షియల్ ప్రొఫెషనల్స్ గ్రూప్ CEO సజిత్ కుమార్ PK ఈ ఆంక్షలను మరింత పారదర్శకత వైపు ఒక అడుగుగా భావిస్తున్నారు. "భారతదేశం తీసుకున్న నిర్ణయం దుబాయ్ గుడ్ డెలివరీ స్టాండర్డ్, CEPA నిబంధనలకు అనుగుణంగా ద్వైపాక్షిక బంగారు వ్యాపారం మరింత నిర్మాణాత్మకంగా ఉండేలా చేస్తుంది" అని ఆయన అన్నారు. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com