భారత్ లో భారీ పేలుళ్లకు ఐఎస్ఐఎస్ కుట్ర
- July 10, 2016
ఐసిస్ ఉగ్రవాదులు హైదరాబాద్ సహా భారత్‌లోని పలు నగరాల్లో విధ్వంసం సృష్టించేందుకు పన్నాగం పన్నారు. కొద్ది రోజుల క్రితం వారాంతంలో హైదరాబాదులో పేలుళ్లు, కాల్పులు జరపాలని ఐఎస్ఐఎస్ కుట్ర పన్ని విషయం తెలిసిందే.
హైదరాబాద్ తర్వాత.. అనంతపురంని టార్గెట్ చేసిన ఐఎస్ఐఎస్, లాడ్జీలో..
ఇంటెలిజెన్స్ ద్వారా తెలియడంతో ఎన్ఐఏ, పోలీసులు పాతబస్తీలో సోదాలు జరిపారు. ఐదుగురు ఐఎస్ఐఎస్ సానుభూతిపరులను అరెస్టు చేశారు. వారిని ఎన్ఐఏ విచారిస్తోంది. ఈ విచారణలో షాకింగ్ విషయాలు వెలుగు చూస్తున్నాయి. విధ్వంసానికో సంస్థ పేరును ఐఎస్ఐఎస్ ఉపయోగించుకోవాలనుకున్నారని తెలిసింది.
ఇటీవల హైదరాబాదులో విధ్వంసం సృష్టించేందుకు పెట్టుకున్న పేరు.. 'జన్ దుల్ ఖిలాఫత్ ఫీ బిలాద్ ఆల్ హింద్'. వీరిని సిరియాలోని ఐఎస్ఐఎస్ ఉగ్రవాద అగ్రనేత షఫీక్ అర్మారే నడిపిస్తున్నారు. హైదరాబాదులో విధ్వంసానికి ఆయనే పై పేరు పెట్టారని తెలుస్తోంది.
హైదరాబాద్‌పై ఐసిస్ చీఫ్ కన్ను: ఎవరెవరికి ఏయే బాధ్యతలు?
నాలుగు నెలలుగా వీరు అదే పేరుతో కార్యకలాపాలు నిర్వహిస్తున్నారని తేలింది. ఈ పేరుతో మరెక్కడా ఉగ్రవాద సంస్థ లేదు. హైదరాబాదులో పేలుళ్ల కోసమే దీనిని స్థాపించారని తెలుస్తోంది.
హైద్రాబాద్‌పై ఐఎస్ఐఎస్: 'వీరి వెనుక ఎవరో తెలియాలి', కిచెన్‌లో బాబులు దాచారు
హైదరాబాదులో విధ్వంసానికి ఐఎస్ఐఎస్ ఉగ్రవాదులతో కలిసి ప్లాన్ చేశారు. సంప్రదింపుల సమయంలో.. హైదరాబాదులోని పేలుళ్ల కోసం పై పేరుతో చలామణి కావాలని ఐఎస్ఐఎస్ టెర్రరిస్టులు సూచించారని తెలుస్తోంది. దీంతో జున్ దుల్ ఖిలాఫత్ ఫీ బిలాద్ ఆల్ హింద్‌ను స్థాపించారు.
ఐసిస్ ప్లాన్: 'క్రాస్ ఎగ్జాం' షాక్, ఎలా బుట్టలో వేస్తారు?
భారత్‌లో ఉగ్ర కార్యకలాపాలు నిర్వహించేందుకు ఐసిస్.. అన్సార్ ఉల్ తౌహీద్ ఫీ బిలాద్ ఆల్ హింద్ పేరుతో ఒక సంస్థను స్థాపించింది. ఈ ఏడాది జనవరిలో హైదరాబాదులో నలుగురితో పాటు దేశవ్యాప్తంగా 14 మంది ఐఎస్ఐఎస్ సానుభూతిపరులను పోలీసులు అరెస్టు చేశారు. వారు జునూద్ ఆల్ ఖలీఫా ఎ హింద్ పేరుతో సంస్థను స్థాపించి విధ్వంసానికి కుట్ర చేశారు.
తాజా వార్తలు
- విశాఖలో భారీగా విదేశీ బంగారం స్వాధీనం
- విమానంలో మంటలు.. ఎమర్జెన్సీ ల్యాండింగ్
- దుబాయ్ ‘దుబాయ్-ఇట్ అవార్డు’ గెలుచుకున్న ఆర్టీఏ.. అభినందించిన షేక్ హమ్దాన్
- దుబాయ్‌లో షేరింగ్ ఇళ్లలో మరిన్ని సౌకర్యాలు..!!
- కువైట్‌లో భారీగా పెరగనున్న యూజ్డ్ కార్ల మార్కెట్..!!
- ఖతార్‌లో న్యాయ, రియల్ ఎస్టేట్ సేవల్లో డిజిటల్ విప్లవం..!!
- బహ్రెయిన్ హెరిటేజ్ సైట్స్.. 22,486 మంది విజిట్స్..!!
- హూతీ దాడిని ఖండించిన అమెరికా.. సౌదీకి మద్దతు..!!
- 2027 నుంచి మస్కట్‌కు వాడీ దైఖా డ్యామ్ వాటర్..!!
- దుబాయ్‌లో తొలిసారిగా ప్రత్యేక బతుకమ్మ గీతం.. ఐదో ఏడాదిలోకి ‘ది స్పార్క్ మీడియా’ వేడుకలు







