40మందిని అరెస్ట్ చేసిన ఫ్రెంచ్ పోలీసులు
- July 10, 2016
ఫ్రాన్స్ లో జరిగిన యూరో 2016 ఫైనల్ ఫుట్ బాల్ మ్యాచ్ లో అల్లర్లు సృష్టించాలని అనుకున్న 40మందిని పారిస్ పోలీసులు అరెస్టు చేశారు. వారందరికి కఠినంగా శిక్షిస్తామని చెప్పారు. తాము విధించిన నిబంధనలు అతిక్రమించి వ్యవహరించడమే కాకుండా పోలీసులను సైతం లెక్కచేయని విధంగా వ్యవహరించారని, ఒక భయానక పరిస్థితిని సృష్టించారని పోలీసులు ఈ సందర్భంగా చెప్పారు. అరెస్టయిన వారిలో పోర్చుగల్ వారు, పారిస్ కు చెందినవారు ఉన్నారని అన్నారు.ఇంకొందరి కోసం గాలింపులు చేపడతున్నామని చెప్పారు. మరిన్ని అరెస్టులు జరిగే అవకాశం లేకపోలేదని చెప్పారు. ఫ్యాన్ జోన్ లోకి అనుమతించలేదని ఇరు దేశాలకు చెందిన కొంతమంది యువకులు ఆందోళన చేపట్టడంతోపాటు వాటర్ బాటిల్స్, చెప్పులు విసరడం, రాళ్లు విసరడంలాంటివి చేశారు. ఇదంతా ఈఫిల్ టవర్ దగ్గర చోటుచేసుకుంది. ఇదికాస్త పెద్దదయ్యే ప్రమాదం ఉందని భావించిన పోలీసులు వారిని టియర్ గ్యాస్, వాటర్ కెనాన్లతో చుట్టుముట్టి అదుపులోకి తీసుకున్నారు. అంతకుముందు ఇంగ్లండ్-రష్యా మ్యాచ్ సమయంలో ఫ్యాన్స్ మధ్య ఘర్షణలు చోటుచేసుకున్న రచ్చరచ్చగా మారిన విషయం తెలిసిందే.
తాజా వార్తలు
- విశాఖలో భారీగా విదేశీ బంగారం స్వాధీనం
- విమానంలో మంటలు.. ఎమర్జెన్సీ ల్యాండింగ్
- దుబాయ్ ‘దుబాయ్-ఇట్ అవార్డు’ గెలుచుకున్న ఆర్టీఏ.. అభినందించిన షేక్ హమ్దాన్
- దుబాయ్‌లో షేరింగ్ ఇళ్లలో మరిన్ని సౌకర్యాలు..!!
- కువైట్‌లో భారీగా పెరగనున్న యూజ్డ్ కార్ల మార్కెట్..!!
- ఖతార్‌లో న్యాయ, రియల్ ఎస్టేట్ సేవల్లో డిజిటల్ విప్లవం..!!
- బహ్రెయిన్ హెరిటేజ్ సైట్స్.. 22,486 మంది విజిట్స్..!!
- హూతీ దాడిని ఖండించిన అమెరికా.. సౌదీకి మద్దతు..!!
- 2027 నుంచి మస్కట్‌కు వాడీ దైఖా డ్యామ్ వాటర్..!!
- దుబాయ్‌లో తొలిసారిగా ప్రత్యేక బతుకమ్మ గీతం.. ఐదో ఏడాదిలోకి ‘ది స్పార్క్ మీడియా’ వేడుకలు







