నానక్ రామ్ గూడలో మొక్కలు నాటిన హీరో రానా
- July 10, 2016
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన హరితహారం కార్యక్రమానికి హీరో దగ్గుబాటి రానా తనవంతుగా మద్దతు తెలిపాడు. సోమవారం ఉదయం అతడు నానక్ రామ్ గూడలో రెండు మొక్కలు నాటాడు. ఈ సందర్భంగా రానా మాట్లాడుతూ పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ మొక్కలు నాటాలని విజ్ఞప్తి చేశాడు. అలాగే నాటిన మొక్కను పరిరక్షించాల్సిన బాధ్యత కూడా ప్రతి ఒక్కరిపై ఉందని, అందరూ హరితహారం కార్యక్రమంలో పాల్గొనాలని కోరాడు.
'గుడ్ మార్నింగ్!! దిస్ ఈజ్ హౌ మై డే బిగెన్! ట్రీ ప్లాంటేషన్ ఇన్ నానక్ రామ్ గూడ!!మేక్ యూఆర్ ఆల్సో గ్రీన్!! అంటూ రానా ట్విట్ చేశాడు. కాగా హరితహారంలో భాగంగా ప్రతి ఒక్కరూ మొక్కలు నాటాలని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ పిలుపునిచ్చిన విషయం తెలిసిందే. ఇప్పటికే పలువురు సినీనటులు హరితహారం కార్యక్రమంలో పాల్గొని మొక్కలు నాటారు.
తాజా వార్తలు
- విశాఖలో భారీగా విదేశీ బంగారం స్వాధీనం
- విమానంలో మంటలు.. ఎమర్జెన్సీ ల్యాండింగ్
- దుబాయ్ ‘దుబాయ్-ఇట్ అవార్డు’ గెలుచుకున్న ఆర్టీఏ.. అభినందించిన షేక్ హమ్దాన్
- దుబాయ్‌లో షేరింగ్ ఇళ్లలో మరిన్ని సౌకర్యాలు..!!
- కువైట్‌లో భారీగా పెరగనున్న యూజ్డ్ కార్ల మార్కెట్..!!
- ఖతార్‌లో న్యాయ, రియల్ ఎస్టేట్ సేవల్లో డిజిటల్ విప్లవం..!!
- బహ్రెయిన్ హెరిటేజ్ సైట్స్.. 22,486 మంది విజిట్స్..!!
- హూతీ దాడిని ఖండించిన అమెరికా.. సౌదీకి మద్దతు..!!
- 2027 నుంచి మస్కట్‌కు వాడీ దైఖా డ్యామ్ వాటర్..!!
- దుబాయ్‌లో తొలిసారిగా ప్రత్యేక బతుకమ్మ గీతం.. ఐదో ఏడాదిలోకి ‘ది స్పార్క్ మీడియా’ వేడుకలు







