దుబాయ్ లో తెలంగాణ వాసి గల్లంతు
- July 11, 2016
నాలుగు నెలల క్రితం ఉపాధి కోసం వచ్చి గత నెల (జూన్ 8 వ తేదీ) నుండి క్యాంప్ నుండి అదృశ్యమైన నడిమెట్ల రాజేందర్.
ఉపాధి కోసం నెల రోజుల క్రితం విసిట్ వీసా లో దుబాయ్ వచ్చిన రాజేందర్ అన్న గంగాధర్ తమ్ముడి ఆచూకీ కోసం నెల రోజుల నుండి వెతుకులాట, భర్ దుబాయ్ లో ఉన్న తెలంగాణ రాష్ట్ర సోదరుల ద్వార ETCA గురించి తెలుసుకొని ఈ రోజు కిరణ్ కుమార్ పీచర ను కలిసి వివరాలు గంగాధర్ తెలియజేసారు. ఆచూకీ కోసం ETCA ప్రయత్నాలు ప్రారంభించారు. ఎవరికైన కనిపించినట్లైతే, ఆచూకీ తెలిసినట్లైతే వెంటనే క్రింది కాంటాక్ట్ నంబర్స్ కి ఫోన్ చేసి సమాచారాన్ని అందించగలరు.
బాబు స్వామి : 055 9360705 / 052 6973778
రాజ శేఖర్ తోట : 055 1917947 / 056 9627881
గంగాధర్ : 056 5303212
వివరాలు :
పేరు నడిమెట్ల రాజేందర్, వయస్సు 26 సంవత్సరాలు, గ్రామం యశ్వంతరావు పేట, మండలం: గొల్లపెల్లి, జిల్లా: కరీంనగర్ కు చెందిన యువకుడు నాలుగు నెలల క్రితం అబుదాబి నేషనల్ హోటల్ లో క్లీనింగ్ వర్కర్ గా ఎంప్లాయిమెంట్ వీసా మీద రావడం జరిగింది, గత నెల జూన్ 08 వ తేదీ నుండి అతడు నివసించే క్యాంప్ లో కనిపించడం లేదు, గత నెల 9 వ తేదీన ఉదయం ఉపాధి కోసం దుబాయ్ వచ్చిన రాజేందర్ అన్న గంగాధర్, తముణ్ణి కలుద్దామని జూన్ 13 వ తేదీన అబుధాబి వెళ్లగా రూం లో రాజేందర్ మిత్రులు జూన్ 8 వ తేదీ బుధవారం రాత్రి నుండి కనిపించడం లేదని, ఫోన్ కూడ రూం లో పెట్టి వెళ్లాడని, కంపెనీ అధికారులకు సమాచారం అందించామని, నెల రోజుల నుండి ఎప్పుడు విచారంగా అలోచిస్తూ ఉండేవాడని, కొంచెం మానసికంగా ఆందోళనకు గురి అయినట్టు కనిపించేవాడని సమాచారం తెలుసుకున్న గంగాధర్ కంపెనీ అధికారులను ఆశ్రయించడం జరిగింది, వాళ్ళు పారిపోయి ఉంటాడని పోలీస్ స్టేషన్ లో పిర్యాదు చేశామని తెలుపడం జరిగింది, వెంటనే బంధువులు, మిత్రులు, యూఏఈ లో ఉంటున్న చుట్టూ ప్రక్కల గ్రామాల మిత్రులందరికీ తెలియచేసి ఆచూకీ కోసం ప్రయత్నాలు చేయడం జరిగింది ఎలాంటి ప్రయోజనం లేక వెంటనే అబుదాబి కాన్సులెట్ అధికారులకు జరిగిన విషయాన్ని తెలియచేసి వివరాలను అందచేయడం జరిగింది.
తెలంగాణ రాష్ట్ర NRI మంత్రిత్వ శాఖ నుండి కూడ తప్పిపోయిన సమాచారాన్ని కాన్సులెట్ అధికారులకు లేఖ ద్వార పంపడం జరిగింది, ఇంటి దగ్గర కుటుంబ సభ్యులు , దుబాయ్ కి కొత్తగా వచ్చిన అన్నకు తమ్ముడి జాడ తెలియక, వెతుకడానికి కూడ సరిపడ డబ్బులు లేక, పని లేక ఇబ్బందులు పడుతున్నాడు గంగాధర్. వెంటనే స్పందించిన కిరణ్ కుమార్ అన్ని వివరాలు తీసుకొని గంగాధర్ కి బాధపడవద్దని దొరుకుతాడని, ఉండటానికి కూడ ఆర్థిక సహాయం అందచేస్తామని, అన్ని ప్రయత్నాలు చేద్దామని, అందరి సభ్యులకు విషయాన్ని తెలియచేసి ఆచూకీ దొరికేలా కృషి చేస్తామని భరోసా కల్పించారు, సంఘ జనరల్ సెక్రెటరీ ప్రవీణ్ గారు రాజేందర్ మిస్సింగ్ సమాచారాన్ని, ఆచూకీ లభించడానికి సహకరించాలని విజ్ఞప్తి లేఖను దుబాయ్, అబుదాబి కాన్సులేట్ అధికారులకు, IWRC అధికారులకు, కేంద్ర ప్రభుత్వానికి పంపనున్నారు. సోషల్ నెటవర్క్ ద్వార రాజేందర్ ఆచూకీ లభించే అవకాశాలు ఉన్నాయని, సంఘ సభ్యుల సహాయంతో మరిన్ని ప్రదేశాలలో వెతుకుతామని, చేతనైనంత సహాయాన్ని కూడ అందచేస్తామని భరోసా కల్పించారు .
దయచేసి ఎవరైనా గంగాధర్ కు ఏదైనా ఉద్యోగం దొరికేలా కూడ సహకరించుమని విజ్ఞప్తి చేస్తున్నాం.
--ETCA
తాజా వార్తలు
- విశాఖలో భారీగా విదేశీ బంగారం స్వాధీనం
- విమానంలో మంటలు.. ఎమర్జెన్సీ ల్యాండింగ్
- దుబాయ్ ‘దుబాయ్-ఇట్ అవార్డు’ గెలుచుకున్న ఆర్టీఏ.. అభినందించిన షేక్ హమ్దాన్
- దుబాయ్‌లో షేరింగ్ ఇళ్లలో మరిన్ని సౌకర్యాలు..!!
- కువైట్‌లో భారీగా పెరగనున్న యూజ్డ్ కార్ల మార్కెట్..!!
- ఖతార్‌లో న్యాయ, రియల్ ఎస్టేట్ సేవల్లో డిజిటల్ విప్లవం..!!
- బహ్రెయిన్ హెరిటేజ్ సైట్స్.. 22,486 మంది విజిట్స్..!!
- హూతీ దాడిని ఖండించిన అమెరికా.. సౌదీకి మద్దతు..!!
- 2027 నుంచి మస్కట్‌కు వాడీ దైఖా డ్యామ్ వాటర్..!!
- దుబాయ్‌లో తొలిసారిగా ప్రత్యేక బతుకమ్మ గీతం.. ఐదో ఏడాదిలోకి ‘ది స్పార్క్ మీడియా’ వేడుకలు







