ఫుట్ బాల్ ఆటగాళ్ల తలలు నరికిన ఐఎస్ఐఎస్
- July 11, 2016
సిరియాలో ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాదులు దారుణానికి పాల్పడ్డారు. తమ ఆదేశాలను లెక్కచేయలేదన్న కారణంతో నలుగురు ఫుట్ బాల్ ఆటగాళ్ల తలలను నరికేశారు. ఐసీస్ ఉగ్రవాదుల ప్రాబల్యం అధికంగా గల రక్కా పట్టణంలో ఈ ఘటన చోటుచేసుకుంది. క్రీడాకారుల తలలను నరికేసి బహిరంగ ప్రదేశంలో పడేసిన ఈ ఘటన కలకలం రేపింది.ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాదులు ఫుట్ బాల్ ఆట ఇస్లాం మతాచారాలకు వ్యతిరేకమైందని, దానిని ప్రోత్సహించొద్దని గతంలో ఆదేశాలు జారీ చేశారు. అయితే.. సిరియాలోని పాపులర్ ఫుట్ బాల్ టీం అల్-షహబ్ తరపున ఆడుతున్న నలుగురు క్రీడాకారులు తమ ఆదేశాలను ధిక్కరించాడంతో పాటు.. కుర్దిష్ తిరుగుబాటుదారులకు అనుకూలంగా వ్యవహరిస్తున్నారన్న కారణంతో ఉగ్రవాదులు ఈ ఘాతుకానికి పాల్పడ్డారు. గత సంవత్సరం టీవీలో ఫుట్ బాల్ మ్యాచ్ చూస్తున్నారన్న కారణంతో 13 మంది యువకులను ఐసీస్ ఉగ్రవాదులు దారుణంగా హతమార్చిన విషయం తెలిసిందే.
తాజా వార్తలు
- విశాఖలో భారీగా విదేశీ బంగారం స్వాధీనం
- విమానంలో మంటలు.. ఎమర్జెన్సీ ల్యాండింగ్
- దుబాయ్ ‘దుబాయ్-ఇట్ అవార్డు’ గెలుచుకున్న ఆర్టీఏ.. అభినందించిన షేక్ హమ్దాన్
- దుబాయ్‌లో షేరింగ్ ఇళ్లలో మరిన్ని సౌకర్యాలు..!!
- కువైట్‌లో భారీగా పెరగనున్న యూజ్డ్ కార్ల మార్కెట్..!!
- ఖతార్‌లో న్యాయ, రియల్ ఎస్టేట్ సేవల్లో డిజిటల్ విప్లవం..!!
- బహ్రెయిన్ హెరిటేజ్ సైట్స్.. 22,486 మంది విజిట్స్..!!
- హూతీ దాడిని ఖండించిన అమెరికా.. సౌదీకి మద్దతు..!!
- 2027 నుంచి మస్కట్‌కు వాడీ దైఖా డ్యామ్ వాటర్..!!
- దుబాయ్‌లో తొలిసారిగా ప్రత్యేక బతుకమ్మ గీతం.. ఐదో ఏడాదిలోకి ‘ది స్పార్క్ మీడియా’ వేడుకలు







