కేరళలో మాయమైన 21 మంది లో ఇద్దరు ముంబైలో ప్రత్యక్షం
- July 11, 2016
ఉగ్రవాద సంస్థ ఇస్లామిక్ స్టేట్ లో చేరేందుకు కేరళ నుంచి పారిపోయినట్లు అనుమానిస్తున్న 21మందిలో ఓ జంటను ముంబయిలో పోలీసులు అరెస్టు చేశారు. వీరి ద్వారా మిగితా వివరాలు రాబట్టనున్నారు. గత నెల రోజు నుంచి ఓ 21మంది కనిపించకుండా పోయారని, వారంతా ఐసిస్ ప్రభావానికి లోనై అందులో చేరేందుకు వెళ్లి ఉండొచ్చని పెద్ద ఎత్తున అనుమానాలు రావడంతో తీవ్రంగా తీసుకున్న పోలీసులు వారికోసం తీవ్రంగా గాలిస్తున్నారు.వీరంతా కేరళలోని కాసర్ గడ్ జిల్లాకు చెందిన వారు. వాస్తవానికి గత శనివారం వరకు ఇలా కనిపించకుండా పోయిన వారు 16మందే అనుకున్నప్పటికీ తాజాగా వారి సంఖ్య 21కి పెరిగింది. అయితే, 21మందిలో ఓ ఇద్దరు మాత్రం కచ్చితంగా ఇస్లామిక్ స్టేట్ లో చేరేందుకు వెళుతున్నారని స్పష్టమైందని పోలీసులు చెబుతున్నారు. వీరంతా క్రిస్టియన్, హిందూ వర్గానికి చెందినవారని ముస్లిం మతంలోకి మారిపోయే అందులో చేరే ప్రయత్నం ప్రారంభించారని అంటున్నారు. ఇప్పటికే గర్భవతి అయిన తమ కూతురు ఇస్లాం మతంలోకి మారి ఐసిస్ లో చేరేందుకు తన భర్తతో సహా వెళ్లిపోయిందని బిందూ అనే ఓ మహిళ నేరుగా పోలీసులకు ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే.
తాజా వార్తలు
- సహోద్యోగి మృతి.. ఆసియా మహిళకు ఏడాది జైలు శిక్ష..!!
- విశాఖలో భారీగా విదేశీ బంగారం స్వాధీనం
- విమానంలో మంటలు.. ఎమర్జెన్సీ ల్యాండింగ్
- దుబాయ్ ‘దుబాయ్-ఇట్ అవార్డు’ గెలుచుకున్న ఆర్టీఏ.. అభినందించిన షేక్ హమ్దాన్
- దుబాయ్‌లో షేరింగ్ ఇళ్లలో మరిన్ని సౌకర్యాలు..!!
- కువైట్‌లో భారీగా పెరగనున్న యూజ్డ్ కార్ల మార్కెట్..!!
- ఖతార్‌లో న్యాయ, రియల్ ఎస్టేట్ సేవల్లో డిజిటల్ విప్లవం..!!
- బహ్రెయిన్ హెరిటేజ్ సైట్స్.. 22,486 మంది విజిట్స్..!!
- హూతీ దాడిని ఖండించిన అమెరికా.. సౌదీకి మద్దతు..!!
- 2027 నుంచి మస్కట్‌కు వాడీ దైఖా డ్యామ్ వాటర్..!!







