కేసీఆర్ హరితరం లో పాల్గొన్న టాలీవుడ్ తారలు

- July 11, 2016 , by Maagulf

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన హరితహారం కార్యక్రమం విజయవంతంగా కొనసాగుతోంది. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ఇవాళ ఒక్కరోజే 25 లక్షల మొక్కలు నాటేందుకు జీహెచ్‌ఎంసీ శ్రీకారం చుట్టింది. ఈ క్రమంలో హరితహారం కార్యక్రమంలో అక్కినేని నాగార్జున, అమల, కాంగ్రెస్ నేత, హీరో చిరంజీవి పాల్గొన్నారు. అన్నపూర్ణ స్టూడియోలో నాగార్జున మొక్కలు నాటగా, అమల కూకట్‌పల్లిలో మొక్కలు నాటారు. చిరంజీవి జూబ్లీహిల్స్‌లో మొక్కలు నాటారు. అనంతరం వీరు ప్రజలకు మొక్కలను అందజేశారు. ప్రతి ఒక్కరూ విధిగా మొక్కలు నాటి పర్యావరణాన్ని కాపాడాలని పిలుపునిచ్చారు.

 

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com