కెన్యా దేశాధ్యక్షుడిని కలిసి భేటీ అయిన మోడీ
- July 11, 2016
కెన్యా దేశాధ్యక్షుడు ఉరు కెన్యట్టాను ప్రధాని మోదీ ఇవాళ కలుసుకున్నారు. ఇద్దరూ అనేక అంశాలపై ముఖాముఖిగా చర్చించారు. ముఖ్యంగా ఆర్ధిక అంశాలను ఇద్దరూ చర్చించినట్లు తెలుస్తోంది. రాజధాని నైరోబీలోని స్టేట్ హౌజ్‌లో మోదీకి అధికార స్వాగతం లభించింది. గడిచిన అయిదు రోజుల్లో మోదీకి ఇది నాలుగవ స్వాగతం అంటూ విదేశాంగ శాఖ కార్యదర్శి ట్వీట్ చేశారు. కెన్యా తొలి దేశాధ్యక్షుడు మీ జోమో కెన్యట్టాకు మోదీ నివాళి అర్పించారు. ఎన్నో ఏళ్లుగా కెన్యా, భారత్ మధ్య సంబంధాలు కొనసాగుతున్నాయని, బిట్రీష్ పాలనకు వ్యతిరేకంగా రెండు దేశాలు పోరాడాయని మోదీ ఈ సందర్భంగా అన్నారు. కెన్యా పర్యటనకు ముందు ప్రధాని మోదీ మొజాంబిక్, దక్షిణాఫ్రికా, టాంజానియా దేశాల్లో పర్యటించారు. సముద్ర జలాల భద్రత, వాణిజ్యం, పెట్టుబడులు, హైడ్రోకార్బన్ల వినియోగం లాంటి అంశాలపై ఒప్పందం కుదుర్చుకునేందుకు మోదీ ఆఫ్రికా దేశాల్లో పర్యటిస్తున్నారు.
తాజా వార్తలు
- యూఏఈలో ఆ పాఠశాలలకు 9 రోజులపాటు సెలవులు..!!
- కువైట్‌లో నాలుగు కేసుల్లో ఆరుగురు అరెస్ట్..!!
- నాలుగు గల్ఫ్ దేశాల్లో ఆరోగ్యకరమైన జీవనశైలిపై అవగాహన..!!
- రాజీనామా చేసి, అప్రూవర్‌గా మారండి: సీఈసీకి రాహుల్ గాంధీ పిలుపు
- ఖతార్‌లో కొత్త చెల్లింపు విధానాలు..!!
- అబుదాబిలో వేర్ హౌజ్ లో భారీ అగ్నిప్రమాదం..!!
- రియాద్ విమానాశ్రయంపై దాడి.. క్షతగాత్రులను పరామర్శించిన సౌదీ ఆరోగ్య మంత్రి..!!
- కువైట్‌లో నవంబర్ 29, 30 తేదీల్లో అంతర్జాతీయ సదస్సు, ఎగ్జిబిషన్..!!
- సౌదీ అరేబియా కింగ్ ఖాలిద్ విమానాశ్రయంపై దాడి.. ఒకరు మృతి, 11 మందికి గాయాలు
- ఒమన్ రాయల్ ఆసుపత్రిలో తొలిసారిగా అధునాతన గుండె చికిత్స..!!







