'విశ్వంభర' ఎక్స్‌క్లూజివ్ ఎపిక్ బుక్‌ను కాన్స్‌లో లాంచ్ చేసిన నిర్మాత విక్రమ్ రెడ్డి
- May 22, 2025
మెగాస్టార్ చిరంజీవి మోస్ట్ అవైటెడ్ సోషియో-ఫాంటసీ మూవీ 'విశ్వంభర' ఇప్పటికే నేషనల్ లెవల్ లో మంచి హైప్‌ను క్రియేట్ చేసింది. ఫస్ట్ గ్లింప్స్, ఫస్ట్ సింగిల్, ఇతర ప్రమోషనల్ మేటీరియల్కు ట్రెమండస్ రెస్పాన్స్ వచ్చింది. వశిష్ఠ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని UV క్రియేషన్స్ బ్యానర్‌పై విక్రమ్, వంశీ, ప్రమోద్‌లు నిర్మిస్తున్నారు. ప్రస్తుతం ఈ చిత్రం పోస్ట్ ప్రొడక్షన్ దశలో ఉంది.
మెగా మాస్ ఇప్పుడు సరిహద్దులు దాటి గ్లోబల్‌గా మారింది. నిర్మాత విక్రమ్ రెడ్డి విశ్వంభరను అంతర్జాతీయ వేదిక అయిన కాన్స్ ఫిల్మ్ ఫెస్టివల్‌కు తీసుకెళ్లారు. అక్కడ విశ్వంభర ఎక్స్‌క్లూజివ్ బుక్‌ను లాంచ్ చేశారు. ఈ సందర్భంగా జరిగిన ఈవెంట్ లో ఆయన సినిమా కథ, భారతీయ పురాణాల ప్రాధాన్యత, బుక్ విశేషాలు గురించి వివరించారు. అలాగే సినిమా స్థాయి, VFX స్టూడియోల సహకారం గురించి కూడా చెప్పారు.
టాప్ హాలీవుడ్ VFX స్టూడియోల భాగస్వామ్యంతో రూపొందుతున్న ఈ చిత్రానికి సంబంధించి పోస్ట్ ప్రొడక్షన్, VFX పనులు ఇప్పటికే 90% పూర్తయ్యాయి. మిగతా పనులు వేగంగా సాగుతున్నాయి.
పనులు పూర్తయ్యాక, మేకర్స్ సినిమా విడుదల తేదీని భారీ ప్రమోషన్లతో ప్రకటించనున్నారు. అయితే #WhatIsInsideVishwambharaBook? అనేది ఇప్పుడు అందరి మనసుల్లో మెదులుతున్న ప్రశ్న.
ఈ చిత్రంలో త్రిషా కృష్ణన్ కథానాయికగా నటిస్తుండగా, ఆశికా రంగనాథ్ కీలక పాత్రలో కనిపించనున్నారు. కునాల్ కపూర్ మరో ముఖ్యమైన పాత్రలో కనిపించనున్నాడు.
ఆస్కార్ విజేత ఎం.ఎం. కీరవాణి సంగీతం అందించగా, పాటలు అద్భుతంగా వచ్చాయి. బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ నెక్స్ట్ లెవల్ లో వుండబోతోంది. విజువల్ స్టోరీటెల్లింగ్‌ను ఛోటా కె.నాయుడు మ్యాసీవ్ గా ప్రజెంట్ చేయనున్నారు. ఈ చిత్రానికి ఎఎస్ ప్రకాష్ ఆర్ట్ డైరెక్టర్.
తారాగణం: మెగాస్టార్ చిరంజీవి, త్రిష కృష్ణన్, ఆశికా రంగనాథ్, కునాల్ కపూర్
సాంకేతిక బృందం:
రచన, దర్శకత్వం: వశిష్ట
నిర్మాతలు: విక్రమ్, వంశీ, ప్రమోద్
బ్యానర్: యువి క్రియేషన్స్
సంగీతం: ఎంఎం కీరవాణి
డిఓపి: చోటా కె నాయుడు
ప్రొడక్షన్ డిజైనర్: ఎఎస్ ప్రకాష్
పీఆర్వో: వంశీ-శేఖర్
మార్కెటింగ్: ఫస్ట్ షో
తాజా వార్తలు
- ఇజ్రాయెల్ పై దాడి చేస్తాం అంటూ ట్రంప్ కు వార్ణింగ్ ఇచ్చిన ఖమేనీ
- MoCI సింగిల్ విండో ఇ-సేవలు విస్తరణ..!!
- సోషల్ మీడియా క్రియేటర్స్ కోసం Dh5 మిలియన్ల ఫండ్..!!
- కువైట్‌లో న్యూబర్న్స్ కు సివిల్ ఐడి జారీ గడువు పొడిగింపు..!!
- ముసందమ్ గవర్నరేట్‌లో ఖసాబ్ ఆసుపత్రి ప్రారంభం..!!
- జెద్దాలో 1,011 భవనాలకు నోటీసులు జారీ..!!
- 2026ను "ఇసా ది గ్రేట్ ఇయర్"గా ప్రకటించిన కింగ్ హమద్..!!
- తొలి వన్డేలో న్యూజిలాండ్ పై భారత్ విజయం
- NEET UG సిలబస్ విడుదల
- తప్పు ఒప్పుకొన్న X..అశ్లీల పోస్టుల తొలగింపు







